చైన్నె–బెంగళూరు.. | Sakshi
Sakshi News home page

చైన్నె–బెంగళూరు..

Published Mon, May 27 2024 6:05 PM

చైన్న

పులి పేరిట ఆటలు
‘పులి సంచరిస్తోందని’ తప్పుడు ప్రచారం చేస్తున్న ఆకతాయిల చర్యలను ఆటవీశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది.

సోమవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2024

మాపాక్షి వద్ద రెండు ప్రాజెక్టు రోడ్లు కలిసే కూడలి

తొలుత నాల్గులేన్లు..

మలి దశలో 8లేన్ల విస్తరణ

మొత్తం 150 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మా ణం సాగుతోంది. ఒకవైపు రెండు, మరోవైపు రెండు లేన్లతో రోడ్డు పనులు సాగుతున్నాయి. భవిష్యత్‌లో ఇటుఇటుగా మరో రెండేసి చొప్పున మొత్తం 8 లేన్లతో నిర్మించేలా ఇప్పటికే భూ సేక రణ పూర్తి చేసి పనులు సాగిస్తున్నారు. హైవే నిర్మాణం అవసరానికి తగిన విధంగా 10 నుంచి 15 అడుగుల ఎత్తులో పనులు సాగిస్తున్నారు. హైవే కింది భాగంలో ఇటుఅటు ప్రయాణ మా ర్గాల కోసం సుమారు 46 అండర్‌ పాస్‌లు నిర్మి స్తున్నారు. 7 ఓవర్‌ ప్యాసేజ్‌లు, 7 ఫ్లై ఓవర్లు, 55 బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు.

సాక్షి, చిత్తూరు: మహానగరాలైన చైన్నె–బెంగళూరురుకు రోడ్డు కనెక్టివిటీ పెంచాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. రూ.4,259 కోట్ల అంచనాలతో బెంగళూరు, చైన్నె మధ్య 262 కిలోమీటర్ల దూరం ఎక్స్‌ప్రెస్‌ హైవే రోడ్డు నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టింది. అక్టోబరు 10, 2022న పనులు ప్రారంభించింది. ఈ రోడ్డు మార్గం కర్ణాటక రాజధాని బెంగళూరు రూరల్‌, కోలార్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మీదుగా తమిళనాడులోని రాణిపేట, కాంచీపురం జిల్లాల నుంచి చైన్నె వరకు రోడ్డు నిర్మాణం సాగుతోంది.

జిల్లాలో 93 కిలోమీటర్ల హైవే

ఈ రోడ్డు మార్గం చిత్తూరు జిల్లాలో సుమారు 93 కిలోమీటర్లు నిర్మిస్తున్నారు. వీకోట, బైరెడ్డిపల్లె, పలమనేరు, బంగారుపాళెం, యాదమరి, చిత్తూ రు, గుడిపాల మీదుగా చైన్నె వరకు నిర్మిస్తున్నారు.

జిల్లాలో మూడు ఎంట్రీలు, ఎగ్జిట్‌లు

ఎక్స్‌ప్రెస్‌ హైవేలోకి వెళ్లేందుకు జిల్లాలో మూడు ఎంట్రీ, ఎగ్జిట్‌లు మాత్రమే ఉన్నాయి. ఇవి చిత్తూరుకు సమీపంలోని గుడిపాల, బంగారుపాళెం సమీపంలోని మొగిలిఘాట్‌, పలమనేరు నియోజవర్గంలోని బైరెడ్డిపల్లెలోమాత్రమే ఉన్నాయి. సుమారు 40 కిలో మీటర్ల మధ్య దూరంతో ఎంట్రీ, ఎగ్జిట్‌లు నిర్మిస్తున్నారు. తమిళనాడులోని వేలూరు, సమీప ప్రాంతం నుంచి బెంగళూరు వె ళ్లే వారు గుడిపాల ఎంట్రీ నుంచి హైవేలోకి రావచ్చు. తిరుపతి మీదుగా వెళ్లే వారికి మొగిలిఘాట్‌లో ఎంట్రీ, ఎగ్జిట్‌ అనుకూలంగా ఉంటుంది. పుంగనూరు, పలమనేరు, కుప్పం ప్రాంతాల నుంచి వెళ్లే వాహనదారులకు బైరెడ్డిపల్లె నుంచి ఎంట్రీ, ఎగ్జిట్‌ సౌకర్యంగా ఉంటుంది.

ద్విచక్ర వాహనాలు, ఆటోలకు నో ఎంట్రీ

హైవేలోకి కార్లు, బస్సులు, హైస్పీడ్‌ ట్రక్కులకు అనుమతి ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ద్విచక్రవాహనాలు, ఆటో, లారీ, ఇతర వాహనాలకు అనుమతి లేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

2.30 గంటల్లోనే బెంగళూరుకు

చైన్నె–బెంగళూరు మధ్య 2021లెక్కల ప్రకారం రోజూ 27,952 వాహనాలు రాకపోకలు సాగించాయి. ఈ నగరాల మధ్య 5 నుంచి 7 గంటలు సమయం పట్టేది. ఎక్స్‌ప్రెస్‌ హైవే అందుబాటులోకి వస్తే రోజూ 33,274 వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉంటుందని అంచనా. ప్రయాణ సమయం కూడా 2.30 గంటల్లోనే గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉంటుంది.

– 8లో

– 8లో

చైన్నె– బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మహానగరాలకు వెళ్లాలంటే ప్రయాణిలకు ఆరేడు గంటల సమయం పడుతోంది. ఈ హైవే పూర్తయితే ప్రయాణ సమయం కేవలం 2.30 గంటలే. చైన్నె–బెంగళూరు మధ్య చిత్తూరు జిల్లా నుంచే రోడ్డు నిర్మాణం సాగుతోంది. వచ్చే ఏడాది జూన్‌ నాటికి ప్రారంభమయ్యేలా పనులు ఎక్స్‌ప్రెస్‌ వేగం పుంజుకున్నాయి. ఈ రెండు మహానగరాలకు జిల్లావాసులు తక్కువ సమయంలోనే హాయిగా ప్రయాణించే అవకాశం త్వరలోనే సాకారం కానుంది.

రూ.4259 కోట్లతో 262 కిలోమీటర్ల హైవే

ఊపందుకున్న రోడ్డు నిర్మాణ పనులు

చిత్తూరుజిల్లాలో 93 కిలోమీటర్ల రహదారి

కౌండిన్య అటవీశాఖ అనుమతులతో వేగంగా పనులు

ఏపీ, తమిళనాడు నుంచి బెంగళూరుకు

తగ్గనున్న ప్రయాణ సమయం

త్వరలోనే సాకారమయ్యేలా ప్రణాళిక

న్యూస్‌రీల్‌

అటవీశాఖకు రూ.66 కోట్ల పరిహారం

జిల్లాలో నిర్మిస్తున్న హైవే రోడ్డు పనులు కౌండిన్య అభయారణ్యంలో సాగుతున్నాయి. అటవీప్రాంతంలోని 48 కిలోమీటర్ల మార్గంలో ఈ రోడ్డు నిర్మాణం సాగుతోంది. ఇందులో 41.5 కిలోమీటర్ల దూరం ఎకో సెన్సిటివ్‌ జోన్‌గా ఇప్పటికే అటవీశాఖ ప్రకటించింది. ఇక్కడ జంతువుల నివాసంగా పరిగణిస్తారు. 7.1 కిలోమీర్లు మాత్రం అన్ని రకాల జంతువులు సంచరించే ప్రాంతంగా ప్రకటించారు. ఈ మార్గంలోని 3.5 కిలోమీటర్లు దూరం మధ్యలోనే జంతువులు అటుఇటుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా హైవే రోడ్డు కింది భాగంలో 5 అండర్‌ పాస్‌ బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. ఇందులో భూ పరిహారం కింద అటవీశాఖకు రూ.49 కోట్లు పరిహారం చెల్లించారు. అటవీశాఖ వన్యప్రాణుల సంక్షరణ చట్టం కింద జంతువులు రక్షణ, నీటి వసతి కల్పన, అటవీ సంక్షరణ సిబ్బంది నియామకం వంటివి ఐదేళ్ల పాటు నిర్వహణ కోసం రూ.17 కోట్లు అటవీశాఖకు చెల్లించారు. అటవీ మార్గాలు, లోయ ప్రాంతాల్లో 4 నుంచి 50 మీటర్ల ఎత్తు, 150 అడుగుల వెడల్పుతో బ్రిడ్జిల నిర్మాణం సాగుతోంది.

చైన్నె–బెంగళూరు..
1/2

చైన్నె–బెంగళూరు..

చైన్నె–బెంగళూరు..
2/2

చైన్నె–బెంగళూరు..

Advertisement
 
Advertisement
 
Advertisement