Sakshi News home page

కల్పవృక్ష వాహనంపై సీతారాములు

Published Wed, Apr 17 2024 12:30 AM

సీతారాముల ఊరేగింపులో అధికారులు - Sakshi

కార్వేటినగరం: శ్రీరామనవమి వార్షికోత్సవాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి ఆలయ ఆవరణంలో వెలసిన శ్రీసీతారామ, లక్ష్మణులు కల్పవృక్ష వాహనంపై పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగారు. ఉదయం సుప్రభాతసేవతో స్వామివార్లను మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం వంటి నిత్యకై ంకర్యాలను నిర్వహించారు. అదేవిధంగా స్వామివారి ఉత్సవ మూర్తులకు పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, నారికేళీ వంటి జలాలు వంటి సుగంధ ద్రవ్యాలతో వేద పండితులు వేద మంత్రాల నడుమ అత్యంత వైభవంగా స్నపన తిరుమంజనం చేపట్టారు. అనంతరం స్వామివార్లను పట్టువస్త్ర, సుగంధ భరిత పుష్పమాలికలు, విశేష ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం వేద పండితులు గోవింద నామ స్మరణలతో నేత్రపర్వంగా ఊంజల్‌సేవ చేపట్టారు. అనంతరం స్వామివారి ఉత్సవ మూర్తులను మండపానికి వేంచేపు చేసి రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పురవీధుల్లో మంగళవాయిద్యాల నడుమ వైభవంగా ఊరేగించారు. భక్తులు ఇంటింటా కర్పూర హారుతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి 9.15 గంటలకు వేద పండితులు స్వామివారిని ఏకాంత సేవలో పవళింపజేశారు. ఆలయ అధికారి సురేష్‌కుమార్‌, వేదపండితులు నారాయణ దాసరి, గోపాలాచారి పాల్గొన్నారు.

నేడు కల్యాణం

గంగాధరనెల్లూరు: మండలంలోని వేల్కూరు గ్రామంలో శ్రీ సీతా సమేత రాముల కల్యాణాన్ని బుధవారం అంగరంగ వైభవంగా జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు. ఉదయం సీతారాముల వారికి ప్రత్యేక అభిషేకపూజలు జరుగుతాయన్నారు. అర్చకులు వేదమంత్రాలు నడుమ కల్యాణం నిర్వహించునున్నట్లు చెప్పారు. అనంతరం భక్తులకు అన్నదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Advertisement

What’s your opinion

Advertisement