‍బ్యాంక్‌ టైమింగ్స్‌ మారుతాయా? | Will Bank Employees Get 5 Days Work Week? Bank Timings May Change, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

రేపు ఇదే జరిగితే.. ‍బ్యాంక్‌ టైమింగ్స్‌ మారుతాయి..

Jan 31 2025 7:37 PM | Updated on Jan 31 2025 8:23 PM

will Bank employees get 5 days work week bank timings may change

బ్యాంకులకు వారంలో 5 రోజులే పనిదినాలు ఉండాలని, రెండు రోజులు సెలవు ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగులు ఎ‍ప్పటి నుంచో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం ఒప్పుకొంటుందా లేదా అన్నది అన్నది శనివారం (ఫిబ్రవరి 1) తేలనుంది. ఎందుకంటే ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కేంద్ర బడ్జెట్‌ 2025-26ను (Union Budget 2025-26) ప్రవేశపెట్టనున్నారు.

రానున్న బడ్జెట్‌లో బ్యాంకు ఉద్యోగుల 5 రోజుల పనిదినాల డిమాండ్‌కు సంబంధించిన ప్రకటన ఉంటుందని ఉద్యోగులు భావిస్తున్నారు. ఒకవేళ బ్యాంకు ఉద్యోగుల డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరిస్తే బ్యాంకులు వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేస్తాయి. రెండు రోజులు మూసిఉంటాయి. దీంతో బ్యాంకుల రోజువారీ పనివేళలు (Bank timings) కూడా మారుతాయి.

రోజూ 40 నిమిషాలు అదనంగా..
వారానికి ఐదు రోజులే పని దినాలు ఉండేలా చూడాలని బ్యాంకు ఉద్యోగులు, సంఘాలు చాలా కాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఒక ప్రభుత్వం ఇలా చేస్తే బ్యాంకులు ప్రతిరోజూ 40 నిమిషాలు అదనంగా పని చేయాల్సి ఉంటుంది. ప్రతి శనివారం, ఆదివారం బ్యాంకు శాఖలు మూసిఉంటాయి. ఇప్పటి వరకు బ్యాంకులు మొదటి, మూడో శనివారాల్లో పనిచేస్తున్నాయి. రెండవ, నాల్గవ శనివారాలు సెలవు పాటిస్తున్నారు. 5 రోజుల పనిదినాలపై బ్యాంకు ఉద్యోగుల సంఘం, ఆర్‌బీఐ, ప్రభుత్వ అధికారుల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ఆర్‌బీఐ, ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది.

నెలలో 8 సెలవులు
బ్యాంకులకు ప్రస్తుతం నెలలో 6 సెలవులు ఉండగా 8 సెలవులు ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం బ్యాంకు ఉద్యోగుల సంఘాలు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వం, ఆర్బీఐ ఆమోదం కోసం పెండింగ్‌లో ఉంది.

ఖాతాదారులకు ఇబ్బందులు!
బ్యాంకుల్లో వారానికి 5 రోజుల పని దినాలు అమలైతే ఖాతాదారులకు కాస్త ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా శనివారాల్లో బ్యాంకు పనులు పూర్తి చేసుకునేవారు అసౌకర్యం ఎదుర్కోవాల్సి ఉంటుంది.వారు తమ పనిని బ్యాంకులు పనిచేసే 5 రోజుల విండోలోనే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అంతే కాదు బ్యాంకులు రోజూ 40 నిమిషాలు అదనంగా తెరవాల్సి ఉంటుంది. ఇందుకోసం బ్యాంకు శాఖలు ఉదయం 9:45 గంటల నుంచి తెరుచుకుంటాయి. సాయంత్రం 5:30 గంటలకు పనివేళలు ముగుస్తాయి. బ్యాంకులను ప్రస్తుతం ఉదయం 10 గంటలకు తెరిచి సాయంత్రం 5 గంటలకు మూసివేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement