వెర్టైస్‌ రూ.100 కోట్ల పెట్టుబడి | VERTICE GLOBAL 100 cr investments in Two Years | Sakshi
Sakshi News home page

వెర్టైస్‌ రూ.100 కోట్ల పెట్టుబడి

Apr 6 2023 5:06 AM | Updated on Apr 6 2023 5:06 AM

VERTICE GLOBAL 100 cr investments in Two Years - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: షేవింగ్‌ బ్లేడ్స్, రేజర్స్, క్రీమ్స్‌ తయారీలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ వెర్టైస్‌ గ్లోబల్‌ వచ్చే రెండేళ్లలో రూ.100 కోట్ల పెట్టుబడి చేయనున్నట్టు ప్రకటించింది. తద్వారా మరో 400–500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కంపెనీ డైరెక్టర్‌ సాయితేజ బొడ్డుపల్లి తెలిపారు.

30 దేశాల్లో ఉత్పత్తులను విక్రయిస్తున్న ఈ కంపెనీ ఇప్పటికే రూ.40 కోట్లు వెచ్చించింది. 200 మంది ఉద్యోగులు ఉన్నారని మరో డైరెక్టర్‌ పురుషోత్తం పబ్బ చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement