ఉత్తమ్‌ గాల్వాకు తగ్గిన నష్టాలు | Uttam Galva Steels Reduced losses in q4 results | Sakshi
Sakshi News home page

ఉత్తమ్‌ గాల్వాకు తగ్గిన నష్టాలు

May 23 2022 1:11 AM | Updated on May 23 2022 1:12 AM

Uttam Galva Steels Reduced losses in q4 results  - Sakshi

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ మెటల్స్‌ కంపెనీ ఉత్తమ్‌ గాల్వా స్టీల్స్‌ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర నష్టం భారీగా తగ్గి రూ. 26 కోట్లకు పరిమితమైంది.

అంతక్రితం ఏడాది(2020–21) ఇ దే కాలంలో రూ. 68 కోట్ల నికర నష్టం నమోదైంది. క్యూ4లో కోల్డ్‌ రోల్డ్, గాల్వనైజ్‌డ్‌ స్టీల్‌ తయారీకి కంపెనీ ఆదాయం సైతం రూ. 197 కోట్ల నుంచి రూ. 252 కోట్లకు బలపడింది. మొత్తం వ్యయాలు రూ. 264 కోట్ల నుంచి రూ. 278 కోట్లకు పెరిగాయి.

Advertisement
 
Advertisement
Advertisement