కార్గిల్ యుద్ధవీరుల గుర్తుగా 'రోనిన్ పరాక్రమ్ ఎడిషన్' | TVS Ronin Parakram Edition Details | Sakshi
Sakshi News home page

కార్గిల్ యుద్ధవీరుల గుర్తుగా 'రోనిన్ పరాక్రమ్ ఎడిషన్'

Aug 1 2024 9:19 AM | Updated on Aug 1 2024 9:32 AM

TVS Ronin Parakram Edition Details

టీవీఎస్ మోటార్ కంపెనీ కార్గిల్ విజయ్ దివస్ జ్ఞాపకార్థం 'రోనిన్ పరాక్రమ్ ఎడిషన్' ఆవిష్కరించింది. ఈ బైక్ ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందినప్పటికీ.. యాంత్రికంగా ఎటువంటి మార్పులు లేదు. అంటే ఈ బైకులో స్టాండర్డ్ మోడల్‌లోని అదే ఇంజిన్ పొందుతుంది.

టీవీఎస్ రోనిన్ పరాక్రమ్ ఎడిషన్ చూడటానికి చాలా కొత్తగా కనిపిస్తుంది. సిల్వర్ యాక్సెంట్స్ కలిగి ఆలివ్ గ్రీన్ కలర్ స్కీమ్ కూడా పొందుతుంది. ఈ ఫ్యూయెల్ ట్యాంక్ మీద జాతీయ జెండా రంగులను చూడవచ్చు. బైక్ మీద కార్గిల్ యుద్దాన్ని తెలిపే సైనికుల పెయింటింగ్ ఉంది. వెనుక స్టెయిన్‌లెస్ స్టీల్ లగేజ్ క్యారియర్ ఉంటుంది.

రోనిన్ పరాక్రమ్ ఎడిషన్ 20.4 హార్స్ పవర్, 19.93 ఎన్ఎమ్ టార్క్ అందించే 225.9 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ పొందుతుంది. ఈ బైక్ USD ఫోర్క్, ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్‌ కలిగి ఉంటుంది. ఇది డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ మాత్రమే కాకుండా రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లను పొందుతుంది. కాబట్టి అదే పర్ఫామెన్స్ అందిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement