వచ్చే ఏడాదీ రూపాయిపై ఒత్తిడి | Rupee likely to remain under pressure in 2023 | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాదీ రూపాయిపై ఒత్తిడి

Nov 26 2022 6:23 AM | Updated on Nov 26 2022 6:23 AM

Rupee likely to remain under pressure in 2023 - Sakshi

ముంబై: రూపాయి వచ్చే ఏడాది కూడా డాల­ర్‌తో ఒత్తిళ్లను ఎదు­ర్కోవచ్చని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. డాలర్‌ మారకంలో 85 శ్రేణిని చేరుకోచ్చని భావిస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత చమురు ధరలు పెరిగిపోవడం, సరఫరా వ్యవస్థలో సమస్యలు తదితర అంశాల ప్రభావంతో రూపాయి విలువ అక్టోబర్‌ 19న జీవిత కాల కనిష్ట స్థాయి 83కు తగ్గిపోవడం తెలిసిందే. ఆ స్థాయి నుంచి కోలుకుని ప్రస్తుతం 82 స్థాయిలో ట్రేడవుతోంది. ముంబైలో గురు వారం ఎస్‌బీఐ బ్యాంకింగ్‌ అండ్‌ ఎకనమిక్‌ సదస్సు జరిగింది.

ఇందులో పాల్గొన్న పలువురు ఆర్థిక వేత్తలు స్పందిస్తూ.. కరెంటు ఖాతా లోటు విస్తరించినందున (జీడీపీలో 4 శాతానికి) ఇక ముందూ రూపాయిపై ఒత్తిడి కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. దీనికితోడు ఎగుమతులు సైతం గత నెలలో క్షీణించడాన్ని ప్రస్తావించారు. వచ్చే ఏడాది డాలర్‌ మారకంలో రూపాయి 82–85 శ్రేణిలో చలించొచ్చని అంచనా వేశారు. రూ పాయి గరిష్టంగా 83, కనిష్టంగా 85కు చేరుకోవచ్చని ఐసీఆర్‌ఐఈఆర్‌ సీఈవో దీపక్‌ మిశ్రా, జేపీ మోర్గాన్‌ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త సాజిద్‌ చినాయ్‌ పేర్కొన్నారు. రూపాయి 80–82 రేంజ్‌లో ఉండొచ్చని ఎస్‌బీఐ ముఖ్య ఆర్థికవేత్త సౌమ్యకాంతి ఘోష్‌ అంచనా వేశా రు. ఐజీఐడీఆర్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ రాజేశ్వరిసేన్‌ గుప్తా 84–85కు చేరుకోవచ్చన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement