నథింగ్‌ ఫోన్‌ 3 లాంచ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఫీచర్లు ఇవేనా.. | Nothing Phone 3 set to launch on July 1 2025 features | Sakshi
Sakshi News home page

నథింగ్‌ ఫోన్‌ 3 లాంచ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఫీచర్లు ఇవేనా..

Jun 11 2025 2:12 PM | Updated on Jun 11 2025 3:08 PM

Nothing Phone 3 set to launch on July 1 2025 features

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ మొబైల్‌ ఫోన్‌ తయారీ సంస్థ నథింగ్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ ‘నథింగ్ ఫోన్ 3’ను జులై 1, 2025న లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. గతంలో ఉన్న మోడళ్లతో పోలిస్తే దీనిలో కొన్ని డిజైన్, హార్డ్‌వేర్‌లో మార్పులను తీసుకొస్తున్నట్లు పేర్కొంది. అయితే టెక్‌ నిపుణుల అంచనాల ప్రకారం నథింగ్‌ ఫోన్‌ 3లో తీసుకొస్తున్న మార్పులు కింది విధంగా ఉండనున్నాయి.

  • ఇంటర్‌ఫేస్‌: కంపెనీ ఉత్పత్తులకు సిగ్నేచర్‌గా నిలిచిన ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్‌ను తొలగించడం లేదు.

  • మూడు 50 ఎంపీ కెమెరాలు: మెరుగైన ఫొటోగ్రఫీ కోసం ప్రధాన, అల్ట్రావైడ్, టెలిఫోటో లెన్స్‌లతో కొత్త కెమెరా మాడ్యూళ్లను అందిస్తుంది.

  • స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ లేదా జెన్ 3: క్వాల్ కామ్ స్నాప్‌ డ్రాగన్‌ చిప్ సెట్ 8 ప్రాసెసర్‌తో మార్కెట్‌లోకి తీసుకొస్తారని భావిస్తున్నారు. ఇది అధిక పనితీరు, ఏఐ ఆధారిత ఫీచర్లను అందిస్తుంది.

  • నథింగ్ ఓఎస్ 3.0 (ఆండ్రాయిడ్ 15): మెరుగైన యూజర్ అనుభవం కోసం ఇంటర్నల్‌గా నథింగ్‌ ఓఎస్‌ 3.0ను తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది.

  • 6.77 అంగుళాల ఎమోలెడ్ డిస్‌ప్లే: 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌, మెరుగైన విజువల్స్ కోసం ఎల్‌టీపీఓ టెక్నాలజీ.

  • 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ: 50 వాట్ వైర్డ్, 25 వాట్ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సదుపాయం ఉంటుంది.

ఇదీ చదవండి: ఉద్యోగులను తైవాన్‌ పంపుతున్న టాటా గ్రూప్‌.. ఎందుకంటే..

ధరలు ఇలా.. (అంచనా మాత్రమే)

  • ఇండియాలో రూ.60,000-రూ.65,000

  • అంతర్జాతీయ మార్కెట్‌లో: 799 డాలర్లు – 899 డాలర్లు (సుమారు రూ.68,000–రూ.73,000)

Advertisement
 
Advertisement
Advertisement