కొత్త ఇన్సూరెన్స్‌ పథకం.. మంచి బెనిఫిట్స్‌తో.. | New Galaxy Marvel plan to boost insurance coverage | Sakshi
Sakshi News home page

కొత్త ఇన్సూరెన్స్‌ పథకం.. మంచి బెనిఫిట్స్‌తో..

Jun 25 2025 3:45 PM | Updated on Jun 25 2025 4:14 PM

New Galaxy Marvel plan to boost insurance coverage

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆరోగ్య బీమా సంస్థ గెలాక్సీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కొత్తగా గెలాక్సీ మార్వెల్‌ పేరిట పాలసీని ప్రవేశపెట్టింది. తొలిసారి క్లెయిమ్‌ చేసేంతవరకు లేదా 55 ఏళ్లు వచ్చేంత వరకు ఒకే ప్రీమియంను కొనసాగించడం, 71 కన్జూమబుల్స్‌కు కవరేజీ, అపరిమిత స్థాయిలో 100 శాతం సమ్‌ ఇన్సూర్డ్‌ను రిస్టోర్‌ చేయడం, ప్రీమియం వెయివర్, ఔట్‌పేషంట్‌ బెనిఫిట్స్‌ మొదలైనవి ఇందులో ఉన్నాయి.

తమ పాలసీల విక్రయం కోసం పాలసీబజార్‌తో చేతులు కలిపినట్లు కంపెనీ ఎండీ జీ. శ్రీనివాసన్‌ తెలిపారు. కార్యకలాపాలు ప్రారంభించిన గత ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 4,730 పైగా పాలసీదార్లకు బీమా భద్రత కల్పించామని, రెండురాష్ట్రాల్లో 1893 మంది పైగా ఏజంట్లతో పటిష్టమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నామని ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement