డోమినోస్‌కు లాభాల పంట, క్యూ2లో రూ. 131 కోట్ల ప్రాఫిట్‌ | Jubilant Foodworks Q2 Net Profit Jumps To Rs 131.5 Crore | Sakshi
Sakshi News home page

డోమినోస్‌కు లాభాల పంట, క్యూ2లో రూ. 131 కోట్ల ప్రాఫిట్‌

Nov 9 2022 7:09 AM | Updated on Nov 9 2022 7:09 AM

Jubilant Foodworks Q2 Net Profit Jumps To Rs 131.5 Crore - Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఫాస్ట్‌ ఫుడ్‌ చైన్‌ దిగ్గజం జూబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌ పటిష్ట ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో నికర లాభం 10 శాతం వృద్ధితో రూ. 131 కోట్లను అధిగమించింది.

గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 120 కోట్లు ఆర్జించింది. డోమినోస్‌ పిజ్జా, డంకిన్‌ డోనట్స్‌ కంపెనీ ఆదాయం 17 శాతం ఎగసి రూ. 1,301 కోట్లను తాకింది. అయితే మొత్తం వ్యయాలు 20 శాతం పెరిగి రూ. 1,154 కోట్లకు చేరాయి. ఈ కాలంలో 76 డోమినోస్‌ స్టోర్లను కొత్తగా ప్రారంభించింది.

Advertisement
 
Advertisement
Advertisement