కనీవినీ ఎరుగని రీతిలో తగ్గుతున్న బంగారం, వెండి - ఈ రోజు ధరలు ఇలా..  | Today Gold And Silver Prices Jan 11th, 2024 In Hyderabad And Other Cities, See Details Inside - Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: కనీవినీ ఎరుగని రీతిలో తగ్గుతున్న బంగారం, వెండి - ఈ రోజు ధరలు ఇలా.. 

Jan 11 2024 12:01 PM | Updated on Jan 11 2024 1:18 PM

Gold And Silver Price Today - Sakshi

2024 జనవరి 3 నుంచి తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఇప్పటి వరకు కూడా తగ్గుతూనే ఉన్నాయి. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయి, చెన్నై, ఢిల్లీలలో ఎలా ఉన్నాయనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు ఒక గ్రామ్ 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 5760.. కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 6283గా ఉంది. ఈ లెక్కన తులం బంగారం రేటు వరుసగా రూ. 57600, రూ. 62830గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు వరుసగా రూ. 100, రూ. 120 తగ్గినట్లు తెలుస్తోంది.

చెన్నైలో బంగారం ధరలు ఈ రోజు వరుసగా రూ. 100, రూ. 110 తగ్గి తులం రేటు రూ.58100 (22 క్యారెట్స్ గోల్డ్), రూ.63380 (24 క్యారెట్స్ గోల్డ్)కు చేరింది. 

ఢిల్లీలో కూడా ఈ రోజు 22 క్యారెట్ల బంగారం రూ. 100 తగ్గినప్పటికీ.. 24 క్యారెట్ల ధరలు ఏకంగా రూ. 880 పెరిగి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. దీంతో నేడు 10 గ్రామ్స్ గోల్డ్ రేటు ఢిల్లీలో రూ. 57750 (22 క్యారెట్స్ గోల్డ్), రూ. 63980 (24 క్యారెట్స్ గోల్డ్)కు చేరింది.

వెండి ధరలు
వెండి ధరల విషయానికి వస్తే.. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో, చెన్నై, ఢిల్లీ, బెంగళూరులలో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న వెండి రేటు రూ. 500 వరకు తగ్గి కొనుగోలుదారులకు కొంత ఉపశమనాన్ని కలిగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement