Elon Musk Spotted With His New Girl Friend Natasha Bassett, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో కెమెరా కంటికి చిక్కిన ఎలాన్‌ మస్క్‌

Jun 1 2022 2:35 PM | Updated on Jun 1 2022 3:20 PM

 Elon Musk Spotted With His new Girl Friend - Sakshi

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్‌ సంచలనాలకు కేంద్ర బిందువు. విచిత్ర వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. సమాకాలిన అంశాలపై తన అభిప్రాయాలను ధైర్యంగా వెల్లడిస్తుంటారు. అంతటి ఎలాన్‌ మస్క్‌ కూడా కొన్ని విషయాల్లో గోప్యత పాటిస్తుంటాడు. సెలబ్రిటీ హోదాలో కెమెరా కంటికి చిక్కకుండా ఉండటానికి ప్రయత్నిస్తుంటాడు. ఎంతగా ప్రయత్నించినా అప్పుడప్పుడు ఆ రహస్యాలు బయట పడక తప్పవు.

స్పేస్‌ఎక్స్‌ ఫౌండర్‌ , టెస్లా కంపెనీ సీఈవో ఎలాన్‌ మస్క్‌(50)​ గత కొంత కాలంగా ఆస్ట్రేలియాకు చెందిన నటి నటాషా బాసెట్‌ (27)తో దోస్తీ చేస్తున్నాడు. 2022 ఫిబ్రవరి నుంచి వీరు తరచుగా కలుస్తున్నారనే వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో వీరిద్దరు కలిసి ఫాన్స్‌లో ఓ హోటల్లో విడిది చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఫ్రాన్స్‌లో ఖరీదైన హోటళ్లో ఒకటైన షివల్‌ బ్లాంక్‌ హోటల్‌లో కలిసి భోజనం చేస్తున్న ఫోటోలు కెమెరాకు దొరికాయి.

నటాషా బాసెట్‌ కొత్త సినిమా ఎల్విస్‌ ప్రమోషన్‌ కోసం ఇటీవల ఆమె కేన్స్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌కి హాజరయ్యారు. ఇక్కడే ఎలాన్‌ మస్క్‌ తల్లి మయే మస్క్‌ను నటాషా కలిసినట్టు సమాచారం. ప్రస్తుతానికయితే ఇద్దరు స్నేహితులుగానే ఉన్నా త్వరలో ఇది ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి. మస్క్‌కి ఇప్పటికే వివాహం అవగా భార్యతో విడిపోయాడు.

చదవండి: Elon Musk: మాట తప్పావ్‌ ఎలాన్‌మస్క్‌.. కానీ నువ్వు కార్యసాధకుడివే..

Advertisement
 
Advertisement
Advertisement