కెనరా బ్యాంక్‌ నుంచి సరికొత్త సేవలు | Canara Bank Launches New Products | Sakshi
Sakshi News home page

కెనరా బ్యాంక్‌ నుంచి సరికొత్త సేవలు

Apr 4 2024 6:19 AM | Updated on Apr 4 2024 12:44 PM

Canara Bank Launches New Products - Sakshi

హైదరాబాద్‌: కెనరా బ్యాంక్‌ పలు కొత్త ఉత్పత్తులు, సరీ్వసులు ప్రారంభించింది. ‘కెనరా హీల్‌’ పేరుతో వినూత్న హెల్త్‌ ప్రొడక్ట్‌ ప్రవేశపెట్టింది. ఆసుపత్రుల్లో చికిత్సలకు బీమా క్లెయిమ్‌ పూర్తిగా రాని సందర్భాల్లో ‘కెనరా హీల్‌’ ద్వారా రుణ సహాయం అందించనుంది. మహిళల కోసం ‘కెనరా ఏంజెల్‌’ అనే పేరుతో కస్టమైజ్డ్‌ సేవింగ్స్‌ ఖాతాను ప్రవేశపెట్టింది. ఎస్‌హెచ్‌జీ గ్రూప్‌ సభ్యులకు ఆన్‌లైన్‌ ద్వారా తక్షణ రుణ సదుపాయానికి ‘కెనరా ఎస్‌హెచ్‌జీ ఈ–మనీ’ తీసుకొచి్చంది.

అలాగే ప్రీ–అప్రూడ్‌ వ్యక్తిగత రుణాలకు ‘కెనరా రెడీక్యా‹Ù’; ఆన్‌లైన్‌ టర్మ్‌ డిపాజిట్‌ రుణాలకు ‘కెనరా మైమనీ’; అవాంతరాలు లేని చెల్లింపులకు ‘కెనరా యూపీఐ 123పే ఏఎస్‌ఐ’ సేవలు ప్రారంభించింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ సీఈఓ రాజేష్‌ బన్సాల్, కెనరా బ్యాంక్‌ ఎండీ, సీఈవో సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement