ఈ రాశివారికి వారం చివరిలో  వ్యయప్రయాసలు

Weekly Horoscope In Telugu 30 May To 5 June 2021 - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు కొంత డబ్బు వెచ్చిస్తారు. సంఘంలో ఆదరణ. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి.  ప్రత్యర్థులు సైతం మీ సమర్థతను మెచ్చుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళాకారులు అనుకున్న అవకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు.  వాహనయోగం. వారం చివరిలో దూరప్రయాణాలు. ధనవ్యయం. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. 

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ముఖ్యమైన పనులు మరింత సాఫీగా సాగుతాయి. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మరింత సంతోషంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. భూ, గృహయోగ సూచనలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.  నిరుద్యోగులకు అనుకూల వాతావరణం. దైవదర్శనాలు చేసుకుంటారు. పారిశ్రామికవర్గాల ఆశలు కొంతమేర ఫలిస్తాయి. వారం ప్రారంభంలో  ఆస్తి వివాదాలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామధ్యానం చేయండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉండి అవసరాలకు సొమ్ము అందుతుంది. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. నిర్ణయాలలో తొందరపాటువద్దు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలు  క్రమేపీ వృద్ధి చెందుతాయి. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతమైన కాలం.  వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. గులాబీ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్తుతి మంచిది.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక వ్యవహారాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య సమస్యలు తీరతాయి. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వాహన, గృహయోగాలు. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. పనిభారం తగ్గే సూచనలు. కళారంగం వారికి అవకాశాలు కొన్ని దక్కవచ్చు. వారం చివరిలో  వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. ఆకుపచ్చ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొత్త ఆశలతో ముందడుగు వేసి పనులు చక్కదిద్దుతారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనుల్లో పురోగతి సాధిస్తారు. బంధుమిత్రుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో  పరపతి పెరుగుతుంది.  సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. కాంట్రాక్టులు సైతం లభిస్తాయి. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి కొంత విముక్తి లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం.  వారం చివరిలో «దనవ్యయం. కుటుంబంలో చికాకులు. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. మేధా దక్షిణామూర్తి స్తుతి మంచిది. 

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. విద్యార్థుల్లోని సత్తా, నైపుణ్యం వెలుగులోకి  వస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వస్తులాభాలు. ఆస్తి వ్యవహారాలలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరట కలిగిస్తుంది. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుని ముందడుగు వేస్తారు. పైస్థాయి వారి ప్రశంసలు అందుతాయి. కళారంగం వారి ఆశలు ఫలించే సమయం.  వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువులతో విభేదాలు. మానసిక అశాంతి. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ పరుస్తాయి. రుణాల కోసం అన్వేషిస్తారు. నిర్ణయాలలో పొరపాట్లు సరిచేసుకునే యత్నాలు చేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఆస్తి విషయాలలో సోదరులతో విభేదాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. పెట్టుబడులు సైతం ఆలస్యమవుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు శ్రమాధిక్యమే తప్ప ఫలితం కనిపించదు. వారం ప్రారంభంలో శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన ఉద్యోగప్రాప్తి. ఎరుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. 

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. కొన్ని ప్రధాన సమస్యలు సైతం తీరతాయి. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని  ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలలో ముందడుగు వేస్తారు. కోర్టు వ్యవహారంలో సానుకూల సంకేతాలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. కళారంగం వారికి మొదట్లో ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. వారం చివరిలో మిత్రుల నుంచి సమస్యలు. ఆరోగ్యభంగం. మానసిక అశాంతి. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. కొత్త రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. విద్యార్థులకు అంచనాలు తారుమారు కాగలవు.  వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతాయి. పెట్టుబడుల్లో జాప్యం.  ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు. ఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహమే. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. విచిత్ర సంఘటనలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీమహావిష్ణుషోడశనామ స్తుతి మంచిది. 

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొత్త పనులను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులు,సోదరీలతో వివాదాలు తీరతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. కుటుంబ విషయాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. గృహ, వాహనయోగాలు కలుగుతాయి. విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. వ్యాపారాలలో అనుకోని లాభాలు దక్కవచ్చు.  ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.  కళాకారులకు  కొన్ని అంచనాలు ఫలిస్తాయి.  వారం  మధ్యలో ఆస్తి వివాదాలు. ఆప్తులతో కలహాలు. అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీసూర్యప్రార్ధన మంచిది. 

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్త మిత్రులు పరిచయమవుతారు.  అనుకోని విధంగా పనులు చక్కదిద్దుతారు.  రావలసిన సొమ్ము  సకాలంలో  అందుతుంది. మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. వివాహ, ఉద్యోగయత్నాలలో ముందడుగు వేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు∙పెరుగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. కొత్త పెట్టుబడులకు అవకాశాలు.  ఉద్యోగాలలో కొన్ని బాధ్యతలు తగ్గవచ్చు. ఉత్సాహవంతంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు కొంత ఊరట లభిస్తుంది.  వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. అనారోగ్య సూచనలు. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవధ్యానం చేయండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
చిన్ననాటి మిత్రుల నుంచి అనుకోని ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి విషయాలలో సమస్యలు తీరి ఒడ్డునపడతారు. కోర్టు వ్యవహారాలు పరిష్కారం. శుభకార్యాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. కొన్ని పాతబాకీలు సైతం అంది ఆర్థికంగా బలం పుంజుకుంటారు. కొన్ని పనులు చకచకా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు వృద్ధి చెంది లాభాలు గడిస్తారు.  ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయవర్గాలకు కొన్ని పదవులు దక్కవచ్చు. వారం మధ్యలో కుటుంబంలో ఒత్తిడులు.  అనారోగ్యం. శ్రమాధిక్యం. ఎరుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.  సుబ్రహ్మణ్యస్తుతి చేయండి.

-సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top