ఈ రాశివారికి వారం మధ్యలో శుభవార్తలు

Weekly Horoscope In Telugu 07-11-2021 To 13-11-2021 - Sakshi

వారఫలాలు: 

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలపై చర్చిస్తారు. ఆప్తుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు కలసివస్తాయి. నూతన గృహయోగాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అనూహ్య మార్పులు. రాజకీయవర్గాలకు ఉత్సాహం.  వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. 

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. కొన్ని వివాదాలకు సంబంధించి చర్చలు సఫలమవుతాయి. వ్యాపారాలలో అనుకున్న ప్రగతి సాధిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి ఆశాజనకంగా ఉంటుంది.  వారం మధ్యలో వ్యయప్రయాసలు. మానసిక ఆందోళన. ఆరోగ్యభంగం. గులాబీ, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. మిత్రులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులు అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. కళాకారులకు సత్కారాలు. రాజకీయ నాయకులకు గౌరవ పదవులు. పారిశ్రామికవర్గాల కోరిక నెరవేరుతుంది.  వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఎరుపు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులు, మిత్రుల సూచనలతో ముందుకు సాగుతారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ధనవ్యయం. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ప్రముఖులతో పరిచయాలు. వాహన, గృహయోగాలు కలుగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగి ముందుకు సాగుతారు. పారిశ్రామిక వర్గాలకు మరింత ఉత్సాహం.  వారం ప్రారంభంలో రుణయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్యం వల్ల పనులలో జాప్యం. కుటుంబంలో సమస్యలు. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
రావలసిన సొమ్ము అందుతుంది. వ్యవహారాలలో విజయం. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.  ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.  వారం మధ్యలో వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. కుటుంబంలో ఒత్తిడులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
పనులలో జాప్యం తప్పదు. ఆర్థిక విషయాలు  నిరాశ కలిగిస్తాయి. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో వివాదాలు. ఇంటి నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కుటుంబసమస్యలు సవాలుగా మారతాయి. విద్యార్థులు మరింత శ్రమపడాలి. వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనల్లో అవాంతరాలు. వారం మధ్యలో శుభవార్తలు. ధనలాభం. వాహనయోగం. నీలం, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.  కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆస్తిలాభం. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవం. ప్రముఖులతో పరిచయాలు. కళాకారులకు సభా మర్యాద, సత్కారాలు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొందరికి పదవులు దక్కవచ్చు. వారం చివరిలో బంధువులతో తగాదాలు. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
అనుకున్న పనులు  విజయవంతంగా సాగుతాయి. సన్నిహితులు సహాయపడతారు. ఒక సమస్య నుంచి బయటపడతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. మీ ఆలోచనలు ఆప్తులతో పంచుకుంటారు. ఆర్థిక విషయాలు మెరుగ్గా ఉంటాయి. వాహనయోగం.  ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. రాజకీయ వర్గాలకు అనూహ్య పదవీలాభం. వారం మధ్యలో ధనవ్యయం. అకాల భోజనం, అనారోగ్యం.  లేత ఎరుపు, బంగారు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొద్దిపాటి చికాకులు ఎదురైనా అ«ధిగమిస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి విషయంలో ఊహించని ఒప్పందాలు. కొత్త వ్యక్తులు పరిచయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.  వ్యాపారాలను మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రతిభ చాటుకుంటారు.  కళారంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం చివరిలో బంధువులతో తగాదాలు. మానసిక ఆందోళన. ఆకుపచ్చ, నలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి అవుతాయి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు ఉండవచ్చు.  రాజకీయవర్గాలకు కొత్త పదవులు రావచ్చు. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. వారం మధ్యలో బంధువిరోధాలు. శ్రమాధిక్యం. అనారోగ్యం. తెలుపు, లేత ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ను పూజించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. గృహనిర్మాణయత్నాలు సానుకూలం. పాత బాకీలు వసూలవుతాయి. సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు.  వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతారు. అధికారుల మన్నన పొందుతారు. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. మిత్రులతో కలహాలు. గులాబీ, పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు  పఠించండి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top