ఈ రాశి వారికి ధనప్రాప్తి.. సంఘంలో గౌరవం | Today Horoscope Telugu-17-12-2021 | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి ధనప్రాప్తి.. సంఘంలో గౌరవం

Dec 17 2021 6:10 AM | Updated on Dec 17 2021 6:10 AM

Today Horoscope Telugu-17-12-2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి శు.చతుర్దశి పూర్తి (24 గంటలు), తదుపరి పౌర్ణమి, నక్షత్రం కృత్తిక ఉ.11.02 వరకు, తదుపరి రోహిణి వర్జ్యం తె.4.40 నుండి 6.27 వరకు (తెల్లవారితే శనివారం)దుర్ముహూర్తం ఉ.8.37 నుండి 9.22 వరకు, తదుపరి ప.12.16 నుండి 1.02 వరకు, అమృతఘడియలు... ఉ.8.22 నుండి 10.04 వరకు.

సూర్యోదయం : 6.27
సూర్యాస్తమయం :  5.25
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 

రాశి ఫలాలు: 

మేషం... మానసిక అశాంతి. కుటుంబంలో సమస్యలు. పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

వృషభం... పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభాలు. ధనప్రాప్తి. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మిథునం... ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. కుటుంబంలో కలహాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కర్కాటకం... పరిస్థితులు అనుకూలిస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వివాహాది యత్నాలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

సింహం... సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

కన్య... రుణయత్నాలు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.

తుల... వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా సాగవు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృశ్చికం... పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆప్తులు సహకరిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

ధనుస్సు.... కొత్త విషయాలు తెలుస్తాయి. పరపతి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మకరం.. కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కుంభం... ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. మానసిక అశాంతి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

మీనం.... కష్టానికి ఫలితం ఉంటుంది. నూతన విద్యాయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. రాబడి పెరుగుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

Advertisement
 
Advertisement
Advertisement