ఈ రాశి వారు సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు | Today Horoscope Telugu-14-09-2021 | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారు సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు

Sep 14 2021 8:13 AM | Updated on Sep 15 2021 6:09 AM

Today Horoscope Telugu-14-09-2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి శు.అష్టమి ప.2.57 వరకు, తదుపరి నవమి నక్షత్రం జ్యేష్ఠ ఉ.9.54 వరకు, తదుపరి మూల, వర్జ్యం సా.5.21 నుండి 6.51 వరకు, దుర్ముహూర్తం ఉ.8.15 నుండి 9.05 వరకు తదుపరి రా.10.44 నుండి 11.31 వరకు అమృతఘడియలు... రా.2.17 నుండి 3.46 వరకు.

సూర్యోదయం : 5.50
సూర్యాస్తమయం :  6.03
రాహుకాలం : ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుంచి 10.30 వరకు 

రాశి ఫలాలు: 

మేషం... అనుకున్న కార్యక్రమాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

వృషభం.... పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మిథునం.... చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కర్కాటకం.... అంచనాలు నిజం కాగలవు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

సింహం... వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కన్య.... రుణయత్నాలు సాగిస్తారు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు చికాకు పరుస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

తుల.... సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆత్మీయుల నుంచి పిలుపు. ఆకస్మిక ధనలాభం. ఆస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

వృశ్చికం... ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

ధనుస్సు... వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మకరం.... వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్య  సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు.

కుంభం... పనులలో పురోగతి. ఆస్తుల వివాదాలు పరిష్కారం. శుభవార్తా శ్రవణం. ధనలాభం. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

మీనం.... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి.

రాశి ఫలాలు ఫోటో స్టోరీస్

Advertisement
 
Advertisement
Advertisement