ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది | Today Horoscope In Telugu-10-09-2021 | Sakshi
Sakshi News home page

ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది

Sep 10 2021 6:28 AM | Updated on Sep 10 2021 6:28 AM

Today Horoscope In Telugu-10-09-2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి శు.చవితి రా.12.23 వరకు, తదుపరి పంచమి నక్షత్రం చిత్త సా.4.10 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం రా.9.26 నుండి 10.56 వరకు, దుర్ముహూర్తం ఉ.8.16 నుండి 9.05 వరకు తదుపరి ప.12.21 నుండి 1.10 వరకు, అమృతఘడియలు... ఉ.10.04 నుండి 11.36 వరకు, వినాయక చవితి.

సూర్యోదయం :    5.50
సూర్యాస్తమయం     :  6.05
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 

మేషం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి పిలుపు రావచ్చు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనూహ్యమైన విజయాలు.

వృషభం: కొత్త పరిచయాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. దైవదర్శనాలు.  స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి. 

మిథునం: కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

కర్కాటకం: ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

సింహం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. నూతన విద్యావకాశాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

కన్య: రుణయత్నాలు ముమ్మరం. పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

తుల: శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరులతో వివాదాలు సర్దుకుంటాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు అధిగమిస్తారు.

వృశ్చికం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తుల వివాదాలు. అనారోగ్యం. ఇంటర్వ్యూలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందిపెట్టవచ్చు.

ధనుస్సు: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో పేరుప్రతిష్ఠలు దక్కుతాయి. సోదరుల నుండి ధనలాభం. యత్నకార్యసిద్ధి. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సంతృప్తినిస్తాయి.

మకరం: వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. పరిస్థితులు అనుకూలిస్తాయి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.

కుంభం: సోదరులతో సఖ్యత నెలకొంటుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

మీనం: వ్యయప్రయాసలు. అనుకోని ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. శ్రమపడ్డా ఫలితం ఉండదు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కాస్త గందరగోళ పరుస్తాయి.

Advertisement
 
Advertisement
Advertisement