ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. మిత్రులతో విభేదాలు.. | Today Horoscope Telugu 05-10-2021 | Sakshi
Sakshi News home page

Horoscope Today: ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. మిత్రులతో విభేదాలు..

Oct 5 2021 6:13 AM | Updated on Oct 5 2021 8:01 AM

Today Horoscope Telugu 05-10-2021 - Sakshi

Rasi Phalalu: వ్యాపారాలు, ఉద్యోగాలో ముందడుగు. కొత్త వ్యక్తుల పరిచయం. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. కార్యజయం. 

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి బ.చతుర్దశి రా.6.25 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం ఉత్తర రా.1.55 వరకు, తదుపరి హస్త, వర్జ్యం ఉ.9.21 నుండి 10.56 వరకు, దుర్ముహూర్తం ఉ.8.15 నుండి 9.04 వరకు, తదుపరి రా.10.37 నుండి 11.24 వరకు అమృతఘడియలు... సా.6.48 నుండి 8.24 వరకు.

సూర్యోదయం :    5.54
సూర్యాస్తమయం    :  5.45
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
 

మేషం: పరపతి పెరుగుతుంది. మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు కలసివస్తాయి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో మంచి గుర్తింపు.

వృషభం: పనులలో ఆటంకాలు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ఆస్తి వివాదాలు. సోదరులతో తగాదాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

మిథునం: కుటుంబంలో చికాకులు. మనశ్శాంతి లోపిస్తుంది. పనులలో ఆటంకాలు. కాంట్రాక్టులు చేజారతాయి. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు నిరాశ చెందుతారు. ఉద్యోగాలలో పనిభారం తప్పదు.

కర్కాటకం: కుటుంబంలో ఉత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. దైవదర్శనాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలం.

సింహం: పనులు ముందుకు సాగవు. అనుకోని ధనవ్యయం. దూరప్రయాణాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలలో లాభాలు కనిపించవు. ఉద్యోగాలలో చికాకులు. 

కన్య: ఉద్యోగయత్నాలు. ఆకస్మిక ధనలాభం. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. 

తుల: అప్పులు చేస్తారు. దూరప్రయాణాలు. పనులలో ఆటంకాలు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు.  వ్యాపారాలు , ఉద్యోగాలలో చిక్కులు.

వృశ్చికం: వ్యాపారాలు, ఉద్యోగాలో ముందడుగు. కొత్త వ్యక్తుల పరిచయం. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. కార్యజయం. 

ధనుస్సు: ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిధ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనయోగం. దూరపు బంధువుల కలయిక. కీలక నిర్ణయాలు.

మకరం: అనుకోని ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. భూవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు.

కుంభం: సన్నిహితులతో విభేదాలు. కుటుంబంలో చికాకులు.  పనులు మందగిస్తాయి. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం తప్పదు.  

మీనం: ప్రముఖులతో పరిచయాలు. వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. అందరిలోను గుర్తింపు. కాంట్రాక్టులు లభిస్తాయి. ఉద్యోగయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూలం.

Advertisement
 
Advertisement
Advertisement