ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం సంభవిస్తుంది | Today Horoscope Telugu-02-10-2021 | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం సంభవిస్తుంది

Oct 2 2021 6:13 AM | Updated on Oct 20 2021 6:15 AM

Today Horoscope Telugu-02-10-2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి బ.ఏకాదశి రా.7.43 వరకు తదుపరి ద్వాదశి, నక్షత్రం ఆశ్లేష రా.1.35 వరకు తదుపరి మఖ, వర్జ్యం ప.1.54 నుండి 3.34 వరకు దుర్ముహూర్తం ఉ.5.55 నుండి 7.30 వరకు అమృతఘడియలు... రా.11.54 నుండి 1.34 వరకు.

సూర్యోదయం : 5.54
సూర్యాస్తమయం :  5.48
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

రాశి ఫలాలు: 

మేషం.... పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభం... మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.

మిథునం...  మిత్రులతో మాటపట్టింపులు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

కర్కాటకం... కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్తులాభాలు. ఇంటర్వ్యూలు రాగలవు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.

సింహం... శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి.

కన్య.....  శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు.

తుల....  కొత్త వ్యక్తుల పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి.

వృశ్చికం... రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువిరోధాలు. ఆరోగ్యభంగం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

ధనుస్సు...  కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. దైవదర్శనాలు.  బంధువులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

మకరం...  పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. ధనలబ్ధి. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

కుంభం...  ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు సజావుగా పూర్తి చేస్తారు. భూ, వాహనయోగాలు. కీలక నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

మీనం... వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. ప్రయాణాలలో మార్పులు. బంధువులతో తగాదాలు. వ్యయప్రయాసలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.
 

Advertisement
 
Advertisement
Advertisement