Daily Horoscope: ఈ రాశి వారు దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు | horoscope today 12 12 2023 rasiphalalu telugu | Sakshi
Sakshi News home page

Daily Horoscope: ఈ రాశి వారు దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు

Dec 12 2023 5:21 AM | Updated on Dec 12 2023 8:28 AM

horoscope today 12 12 2023 rasiphalalu telugu - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి: అమావాస్య తె.5.13 వరకు (తెల్లవారితే బుధవారం), తదుపరి మార్గశిర శుక్ల పాడ్యమి, నక్షత్రం: అనూరాధ ప.12.03 వరకు తదుపరి జ్యేష, వర్జ్యం: సా.5.36 నుండి 7.14 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.34 నుండి 9.22 వరకు, తదుపరి రా.10.37 నుండి 11.25 వరకు, అమృతఘడియలు: రా.3.11 నుండి 4.46 వరకు. యమగండం :  ఉ.9.00 నుండి 10.30 వరకు రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం : 6.24, సూర్యాస్తమయం :  5.23.

మేషం.... పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృషభం.... నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ. వ్యవహారాలలో విజయం. సోదరుల నుంచి ధనలాభం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

మిథునం.... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. విందువినోదాలు. వ్యాపారాలు,ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం.... ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం.

సింహం.... రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.

కన్య..... కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. భూలాభాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

తుల..... శ్రమ తప్పదు. పనులలో ఆటంకాలు. వృథా ఖర్చులు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృశ్చికం..... దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. విందువినోదాలు. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. 

ధనుస్సు... వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మకరం..... ఆదాయం పెరుగుతుంది. వస్తులాభాలు. ఉద్యోగయత్నాలు సానుకూలం. సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు.వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

కుంభం... అనుకోని ప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. దుబారా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం.... పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రగతి. నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆస్తిలాభం. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
  

Advertisement
 
Advertisement
Advertisement