ఈ రాశివారికి ఉద్యోగాల్లో ఉన్నతస్థితి.. | Daily Horoscope In Telugu (07-11-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (07-11-2020) 

Nov 7 2020 6:21 AM | Updated on Nov 7 2020 6:21 AM

Daily Horoscope In Telugu (07-11-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు నిజ ఆశ్వయుజ మాసం, తిథి బ.సప్తమి రా.2.10 వరకు తదుపరి అష్టమి, నక్షత్రం పుష్యమి తె.4.44 వరకు (తెల్లవారితే ఆదివారం), తదుపరి ఆశ్లేష, వర్జ్యం ప.12.34 నుంచి 2.10 వరకు, దుర్ముహూర్తం ఉ.6.04 నుంచి 7.34 వరకు అమృతఘడియలు... రా.10.15 నుంచి 11.51 వరకు.

సూర్యోదయం :    6.04
సూర్యాస్తమయం    :  5.24
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

మేషం: పనుల్లో తొందరపాటు. బంధువులతో తగాదాలు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో శ్రమ పెరుగుతుంది.

వృషభం: ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు. శుభవార్తా శ్రవణం. ఆదాయం సంతృప్తినిస్తుంది. నిరుద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలలో అనుకోని లాభాలు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మిథునం: ప్రయాణాల్లో ఆటంకాలు. దుబారా ఖర్చులు. ఉద్యోగాలలో ఒత్తిడులు. పుణ్యక్షేత్రాల  సందర్శనం. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలలో వివాదాలు. ఉద్యోగాలలో ఇబ్బందులు.

కర్కాటకం: పనుల్లో  విజయం. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వాహనయోగం. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలు నూతనోత్సాహం.

సింహం: రుణదాతల నుంచి ఒత్తిడులు. పనుల్లో  అవరోధాలు.  వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో ఇబ్బందులు. ఉద్యోగాలలో అదనపు విధులు.

కన్య: పరిశోధనలు ఫలిస్తాయి. మిత్రులతో సత్సంబంధాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. వాహనయోగం.

తుల: కొత్త పనులు చేపడతారు. వస్తులాభాలు. కుటుంబసౌఖ్యం. ఉద్యోగాల్లో ఉన్నతస్థితి దక్కుతుంది. వ్యాపారాలలో అధిక లాభాలు. ఆలయ దర్శనాలు.

వృశ్చికం: కొన్ని వ్యవహారాలు నిదానిస్తాయి. కుటుంబంలో చికాకులు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఉద్యోగాలలో నిరుత్సాహం. వ్యాపారాలలో మరింత కష్టించాలి. దైవచింతన. 

ధనుస్సు: కుటుంబసభ్యులతో విరోధాలు. విమర్శలు ఎదురవుతాయి. కష్టానికి ఫలితం అంతగా కనిపించదు. దూరప్రయాణాలు. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో  అప్రమత్తంగా మెలగాలి.

మకరం: కార్యజయం. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ఆప్తుల నుంచి కీలక సమాచారం. వాహనయోగం. ఉద్యోగాలలో మరింత ప్రగతి. వ్యాపారాలలో ప్రోత్సాహం. 

కుంభం: చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆర్థిక విషయాలలో పురోగతి. వస్తులాభాలు. సోదరులతో సఖ్యత. వ్యాపారాలలో మరింత లాభాలు. ఉద్యోగాలలో ఉత్సాహం.

మీనం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement