ఈ రాశి వారికి శుభవర్తమానాలు, ధనలాభం | Daily Horoscope In Telugu (06-1-2021) | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి శుభవర్తమానాలు, ధనలాభం

Jan 6 2021 6:26 AM | Updated on Jan 6 2021 11:27 AM

Daily Horoscope In Telugu (06-1-2021) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి బ.అష్టమి రా.12.56 వరకు తదుపరి నవమి, నక్షత్రం హస్త సా.4.35 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం రా.12.04 నుంచి 1.34 వరకు దుర్ముహూర్తం ఉ.11.44 నుంచి 12.26 వరకు అమృతఘడియలు... ఉ.10.56 నుంచి 12.25 వరకు.

సూర్యోదయం :    6.36
సూర్యాస్తమయం    :  5.35
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం : ఆకస్మిక ధనలబ్ధి. సమస్యల పరిష్కారంలో క్రియాశీపాత్ర పోషిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. కార్యసిద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్నతి.

వృషభం : నిరుద్యోగులకు నిరాశ. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధికం.

మిథునం : కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

కర్కాటకం : మిత్రుల నుంచి ధనలబ్ధి. కొత్త విషయాలు గ్రహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

సింహం : పనుల్లో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

కన్య : పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సంఘంలో ఆదరణ. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

తుల : వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. కుటుంబసభ్యులతో విరోధాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

వృశ్చికం : శుభవర్తమానాలు. ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త వ్యక్తుల పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

ధనుస్సు : విద్యార్థులకు అనుకూల సమయం. విచిత్ర సంఘటనలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.

మకరం : వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కుంభం : పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. కష్టానికి ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

మీనం : నిర్ణయాలలో ఆటంకాలు తొలగుతాయి. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement