ఈ రాశివారికి సమాజంలో గౌరవం, ఆస్తిలాభం | Daily Horoscope In Telugu (04-1-2021) | Sakshi
Sakshi News home page

ఈ రాశివారికి సమాజంలో గౌరవం, ఆస్తిలాభం

Jan 4 2021 6:33 AM | Updated on Jan 4 2021 8:00 AM

Daily Horoscope In Telugu (04-1-2021) - Sakshi

సోమవారం, 4.1.2021 – శ్రీశార్వరినామ సంవత్సరం. దక్షిణాయనం, హేమంత ఋతువు. మార్గశిర మాసం. తిథి బ.పంచమి ఉ.6.45 వరకు, తదుపరి షష్ఠి తె.5.03 వరకు (తెల్లవారితే మంగళవారం) నక్షత్రం పుబ్బ రా.7.10 వరకు, తదుపరి ఉత్తర. వర్జ్యం రా.2.01 నుంచి 3.33 వరకు. దుర్ముహూర్తం ప.12.26 నుంచి 1.11 వరకు, తదుపరి ప.2.40 నుంచి 3.22 వరకు. అమృత ఘడియలు ప.12.58 నుంచి 2.30 వరకు.

సూర్యోదయం 6.36. సూర్యాస్తమయం 5.35. 
రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు.
యమగండం ప.10.30 నుంచి 12.00 వరకు.

మేషం : వ్యవహారాలు నిదానిస్తాయి. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

వృషభం : విద్యార్థులకు శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

మిథునం : వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోని సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కర్కాటకం : శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. బంధుమిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళపరుస్తాయి.

సింహం : వ్యవహారాలలో అనుకూలత. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.

కన్య : పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు. ఆరోగ్యభంగం.

తుల : ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

వృశ్చికం : నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ధనుస్సు : పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మకరం : శ్రమాధిక్యం. పనులు మధ్యలో విరమిస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

కుంభం : పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవం. ఆస్తిలాభం. నూతన పరిచయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మీనం : ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులు సేకరిస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement