ఈ రాశివారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి

Daily Horoscope In Telugu (03-1-2021) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి బ.చవితి ఉ.8.05 వరకు తదుపరి పంచమి నక్షత్రం మఖ రా.8.02 వరకు తదుపరి పుబ్బ వర్జ్యం ఉ.8.12 నుంచి 9.46 వరకు, తదుపరి రా.3.43 నుంచి 5.14 వరకు (తెల్లవారితే సోమవారం), దుర్ముహూర్తం సా.4.05 నుంచి 4.51 వరకు, అమృతఘడియలు... సా.5.36 నుంచి 7.11 వరకు.

సూర్యోదయం        :  6.36
సూర్యాస్తమయం    :  5.34
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

మేషం : వ్యవహారాలు ముందుకు సాగవు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

వృషభం : అనుకున్న పనులలో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

మిథునం : సన్నిహితులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

కర్కాటకం : వ్యవహారాలలో ఆటంకాలు. కొత్త రుణయత్నాలు. ప్రయాణాలు రద్దు. ఉద్యోగయత్నాలు ముందగిస్తాయి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉండవచ్చు.

సింహం : ప్రముఖులతో పరిచయాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కన్య : ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.

తుల : నూతన వ్యక్తుల పరిచయాలు. సంఘంలో ఆదరణ. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వృశ్చికం : వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు.

ధనుస్సు : రుణఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

మకరం : అనుకోనిప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులు ముందుకు సాగవు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కుంభం : పరిచయాలు పెరుగుతాయి. భూ వివాదాలు తీరతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వాహనసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మీనం : విచిత్ర సంఘటనలు. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top