గ్రహం అనుగ్రహం (02-11-2020) | Daily Horoscope In Telugu (02-11-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (02-11-2020)

Nov 2 2020 7:08 AM | Updated on Nov 2 2020 7:08 AM

Daily Horoscope In Telugu (02-11-2020) - Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం. దక్షిణాయనం, శరదృతువు. నిజ ఆశ్వయుజ మాసం. తిథి బ.విదియ రా.11.00 వరకు, తదుపరి తదియ. నక్షత్రం కృత్తిక రా.10.51 వరకు, తదుపరి రోహిణి. వర్జ్యం ఉ.9.37 నుంచి 11.23 వరకు. దుర్ముహూర్తం ప.12.05 నుంచి 12.51 వరకు, తదుపరి ప.2.22 నుంచి 3.10 వరకు. అమృత ఘడియలు రా.8.10 నుంచి 9.55 వరకు;

సూర్యోదయం: 6.02 సూర్యాస్తమయం: 5.27 
రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు.
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు 

మేషం: చేపట్టిన పనులు కొంత నిదానిస్తాయి. ఆలోచనలు కలసిరావు. కుటుంబసమస్యలు ఎదురవుతాయి.  దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని అడ్డంకులు.

వృషభం: బాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఆస్తిలాభం. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు.

మిథునం: మిత్రులతో వివాదాలు. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో కొత్త చిక్కులు.

కర్కాటకం: కొత్త విషయాలు గ్రహిస్తారు. చర్చల్లో కొంత పురోగతి. మిత్రుల నుంచి ముఖ్య సమాచారం. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో మీ కృషి ఫలిస్తుంది. దైవచింతన.

సింహం: ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కన్య: ముఖ్యమైన వ్యవహారాలు కొన్ని వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా గందరగోళ పరిస్థితి. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.

తుల: శ్రమ తప్పదు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. భూ వివాదాలు. దైవదర్శనాలు. ఇంటర్వ్యూలు నిరాశ పరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో కొన్ని సమస్యలు.

వృశ్చికం: కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. బంధువులతో స్వల్ప విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఇబ్బందిగా మారవచ్చు.

ధనుస్సు: ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. అదనపు ఆదాయం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

మకరం: పనులలో అడ్డంకులు. ఆస్తి వివాదాలు.  శ్రమాధిక్యం. మిత్రుల నుంచి విమర్శలు. దైవచింతన. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు పెరుగుతాయి.

కుంభం: రుణాలు చేస్తారు. ఎంత శ్రమపడ్డా ఫలితం ఉండదు. ప్రయాణాలలో మార్పులు. ఆస్తి వివాదాలు. మిత్రులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

మీనం: పనులు సకాలంలో పూర్తి. దైవదర్శనాలు. నూతన ఉద్యోగప్రాప్తి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వాహనయోగం. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement