ఈ రాశివారు భూములు, వాహనాలు కొంటారు | Daily Horoscope In Telugu (02-1-2021) | Sakshi
Sakshi News home page

ఈ రాశివారు భూములు, వాహనాలు కొంటారు

Jan 2 2021 7:19 AM | Updated on Jan 2 2021 9:33 AM

Daily Horoscope In Telugu (02-1-2021) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి బ.తదియ ఉ.8.54 వరకు తదుపరి చవితి, నక్షత్రం ఆశ్లేష రా.8.26 వరకు, తదుపరి మఖవర్జ్యం ఉ.9.14 నుంచి 10.50 వరకు దుర్ముహూర్తం ఉ.6.34 నుంచి 8.03 వరకు అమృతఘడియలు... సా.6.48 నుంచి 8.42 వరకు.

సూర్యోదయం :    6.34
సూర్యాస్తమయం    :  5.32
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

మేషం: రుణాలు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. పనులు మధ్యలో వాయిదా.  వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.

వృషభం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది.  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం

మిథునం: వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆనారోగ్య సూచనలు. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కర్కాటకం: పనులలో పురోగతి సాధిస్తారు. సంఘంలో గౌరవం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు.

సింహం: కుటుంబంలో  చికాకులు. ధనవ్యయం. ఆలోచనలు కలసిరావు. ఆరోగ్యసమస్యలు. వృత్తి, వ్యాపారాలలో నిరాశ. బంధువుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. ఉత్సాహంగా పనులు పూర్తి. బంధువులతో సత్సంబంధాలు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.

తుల: పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తలు. ఆలయాలు సందర్శిస్తారు.వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

వృశ్చికం: కీలక నిర్ణయాలు. వ్యవహారాలు ముందుకు సాగవు.  ప్రయాణాలలో మార్పులు. అనుకోని ఖర్చులు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.

ధనుస్సు: ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. శ్రమ తప్పదు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు.

మకరం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కుంభం: కొత్త పనులకు శ్రీకారం. విందువినోదాలు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక వృద్ధి. వ్యాపారాలలో పురోభివృద్ధి.  ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మీనం: మిత్రులతో విరోధాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. దైవదర్శనాలు. పనులు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

Advertisement
 
Advertisement
Advertisement