గ్రహం అనుగ్రహం (01-11-2020) | Daily Horoscope In Telugu (01-11-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (01-11-2020)

Nov 1 2020 5:59 AM | Updated on Nov 1 2020 6:02 AM

Daily Horoscope In Telugu (01-11-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు నిజ ఆశ్వయుజ మాసం, తిథి బ.పాడ్యమి రా.9.05 వరకు, తదుపరి విదియ నక్షత్రం భరణి రా.8.25 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం తె.4.30 నుంచి 6.14 వరకు దుర్ముహూర్తం సా.3.54 నుంచి 4.40 వరకు, అమృతఘడియలు... ప.3.05 నుంచి 4.52 వరకు.

సూర్యోదయం     :  6.02
సూర్యాస్తమయం    :  5.27
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: కొత్త పరిచయాలు. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. పనుల్లో విజయం. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

వృషభం: సన్నిహితులతో అకారణంగా విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

మిథునం: పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగాలు కొంత అనుకూలిస్తాయి. వ్యాపారాలలో అంచనాలు తప్పుతాయి.

కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులతో మరింత సఖ్యత. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.

సింహం: కొన్ని పనులు హఠాత్తుగా విరమిస్తారు. బంధువుల నుంచి సమస్యలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో ఇబ్బందులు.

కన్య: ఆశ్చర్యకరమైన సంఘటనలు. పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రయాణాలు వాయిదా. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

తుల: సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభవార్తలు. పనుల్లో విజయం. బంధువుల కలయిక. విద్యావకాశాలు పెరుగుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరం.

వృశ్చికం: ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం. వస్తులాభాలు. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి.

ధనుస్సు: పనులు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది.

మకరం: ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. దైవచింతన. ఖర్చులు అధికం. వ్యాపారాలు, ఉద్యోగాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి.

కుంభం: గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఎదురుండదు.

మీనం: పనులు నిదానిస్తాయి. శ్రమాధిక్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement