అనుమానాస్పదంగా ఉపాధ్యాయుడి మృతి | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదంగా ఉపాధ్యాయుడి మృతి

Published Mon, May 27 2024 12:25 AM

అనుమానాస్పదంగా ఉపాధ్యాయుడి మృతి

మియాపూర్‌ : అనుమానాస్పద స్థితిలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ దుర్గా రామలింగ ప్రసాద్‌ వివరాల మేరకు.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన శ్రీనివాస్‌, సరస్వతి దంపతులకు కుమారుడు జయప్రకాష్‌ నారాయణ(35), కుమార్తె ప్రశాంతి ఉన్నారు. జయప్రకాష్‌ నారాయణ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని రాయచోటిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 22న నగరం లోని కూకట్‌పల్లి సమీపంలోని బాలాజీ నగర్‌లోని తన సోదరి ప్రశాంతి ఇంటికి వచ్చాడు. శనివారం ఉదయం వెళ్లి ఇంటికి రాకపోవడంతో సోదరి ప్రశాంతి కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జయప్రకాష్‌ నారాయణ శనివారం ఉదయం సోదరి ఇంటి నుంచి వచ్చి మియాపూర్‌ మదీనగూడలోని ప్లాగ్‌షిఫ్‌ ఓయో వెన్నెల రెసిడెన్సీలో రూమ్‌ తీసుకుని ఉండిపోయాడు. ఆదివారం మధ్యాహ్నం బయటకు రాకపోవడంతో లాడ్జి నిర్వాహకులు వెళ్లిచూడగా బెడ్‌పై అచేతన స్థితిలో ఉన్నాడు. వెంటనే లాడ్జి నిర్వాహకులు మియాపూర్‌ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అప్పటికే జయప్రకాష్‌ మృతి చెందాడు. అతని వద్ద ఆయుర్వేదిక్‌ మందులు ఉండడం గుర్తించారు. మృతుడి తల్లి సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే జయప్రకాష్‌ నారాయణది ఆత్మహత్యా... హత్యా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement