సాక్షి, తాడేపల్లి: ఎంపీ మిథున్‌రెడ్డిపై హత్యాయత్నాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండించింది. టీడీపీ నేతలు.. దాడులు చేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలవలేక అక్రమమార్గంలో వెళ్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. ఏపీలో శాంతి భద్రతలు విఫలమైందని ఆయన మండిపడ్డారు.
‘‘బందీపోటు దొంగల్లా టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నారు. ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై కర్రలు, రాళ్లతో దాడులు చేశారు. నామినేషన్ల ప్రక్రియ మొదలైన మొదటిరోజే దాడులు చేస్తున్నారు’’ అని లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు.
ఓటమి భయంతోనే దాడులు..
విజయనగరం: ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనలో సామాన్యులకే రక్షణ లేదని.. ఓటర్లను, అభ్యర్థులను భయపెట్టాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారంటూ మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో ఎంపీ మిధున రెడ్డి పై దాడిని ఖండిస్తున్నాం. చంద్రబాబు దుష్ట పరిపాలనకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓటమి భయంతో వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు చేస్తున్నారు’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యంలో నేడు చీకటి దినం
చిత్తూరు: ప్రజాస్వామ్యంలో నేడు చీకటి దినం అని వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గం ఇంఛార్జ్ విజయానందరెడ్డి అన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి హత్యాయత్నం ఘటనను తీవ్రంగా ఖండించారు, ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారు. దాడులను తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఆయన హెచ్చరించారు.
ఇదీ చదవండి: మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం


