ముక్కంటి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి  | Supreme Court judge at Srikalahasti | Sakshi
Sakshi News home page

ముక్కంటి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి 

Sep 2 2023 4:22 AM | Updated on Sep 2 2023 4:22 AM

Supreme Court judge at Srikalahasti - Sakshi

శ్రీకాళహస్తి(తిరుపతి జిల్లా): శ్రీకా­ళహస్తిలో ని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వా­మి­ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గోపీనాథ్‌ మీనన్‌ శుక్రవారం దర్శించుకున్నారు. ఆ­ల­య దక్షిణ గోపురం వద్ద ఆ­ల­య అధికారు­లు వీరికి సాంప్రదా­యబద్ధంగా స్వాగతం పలి­­­కి దర్శన ఏర్పాట్లు చేశారు.

ముందుగా వారు రాహుకేతు పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, స్వామి అమ్మవార్ల చిత్రపటాలు, ప్రసాదాలను అందజేశారు. కాగా, స్వామివారిని దర్శించుకున్న వారిలో ఆర్‌కే గ్రూప్స్‌ అధినేత పద్మశ్రీ డాక్టర్‌ రవి పిళ్లై, సుమారు 20 మంది రష్యా దేశస్థులు కూడా ఉన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement