మళ్లీ రాయనకే చాన్స్‌ | YSRCP Names Former Mayor Rayana Bhagyalakshmi As Vijayawada Mayor Candidate For 2026 Municipal Elections | Sakshi
Sakshi News home page

మళ్లీ రాయనకే చాన్స్‌

Oct 17 2026 9:41 AM | Updated on Oct 17 2026 10:42 AM

Rayana Bhagyalakshmi As Mayor Candidate For Vijayawada

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): వైఎస్సార్‌ సీపీ విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన మాజీ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మిని  ఆ పార్టీ అధిష్టానం శుక్రవారం ప్రకటించింది. నగరాల సామాజిక వర్గానికి చెందిన భాగ్యలక్ష్మి 2021 నుంచి 2026 వరకూ విజయవాడ  మేయర్‌గా పని చేశారు. శ్రీకాకుళంలో నీటి పారుదల శాఖలో ఉద్యోగి బెవర నారాయణరావు దంపతులకు భాగ్యలక్ష్మి 1982లో జన్మించారు. విజయవాడకు చెందిన రాజకీయ నేప థ్యం కలిగిన రాయన విశ్వనాథం తనయుడు రాయన నరేంద్రను ఆమె వివాహమాడారు.  

2021లో తొలిసారి అవకాశం.. 
2021లో విజయవాడ నగరపాలకసంస్థకు జరిగిన ఎన్నికల్లో భాగ్యలక్ష్మి 46వ డివిజన్‌ నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారిగా కార్పొరేటర్‌గా గెలిచారు. అనంతరం బీసీ వర్గానికి అందులోనూ నగరాల సామాజికవర్గానికి పెద్ద పీట వేస్తూ అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆమెకు మేయర్‌గా అవకాశం కల్పించటంతో ఆమె 2021 నుంచి 2026 వరకూ నగర మేయర్‌గా విజయవంతంగా పదవీకాలాన్ని పూర్తి చేశారు. కాగా ఇప్పుడు నేరుగా మేయర్‌ను ఎన్నుకొనే అవకాశం రావడంతో మరోసారి రాయన ఆ స్థానం నుంచి పోటీపడనున్నారు. ఈ సందర్భంగా తనకు అవకాశం కల్పించిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటానని, అత్యధిక మెజారిటీతో గెలిచి నమ్మ కాన్ని నిలబెట్టుకుంటానని రాయన చెప్పారు.

మునిసిపల్‌ స్థానాలకు వీరు..
జనరల్‌ మహిళకు కేటాయించిన జగ్గయ్య పేట మునిసిపాలిటీకి షేక్‌ హఫీజున్నీసా (ముస్లిం), జనరల్‌కు కేటాయించిన నంది గామ మునిసిపాలిటీకి చల్లా బ్రహ్మేశ్వరరావు (వైశ్య), పెడన మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ అభ్యర్థిగా కటకం నాగకుమారి (దేవాంగ)లను పార్టీ అధిష్టానం ఖరారు చేస్తూ శుక్రవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement