నేడు, రేపు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు | Moderate Rains In AP For Two Days | Sakshi
Sakshi News home page

నేడు, రేపు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు

Aug 29 2020 5:29 AM | Updated on Aug 29 2020 5:29 AM

Moderate Rains In AP For Two Days - Sakshi

మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఉత్తర ఛత్తీస్‌గఢ్, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్యప్రదేశ్‌ ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తర–దక్షిణ ద్రోణి ఉత్తర కోస్తా తమిళనాడు నుంచి కోమోరిన్‌ ప్రాంతం వరకు 0.9 కి.మీ. ఎత్తు వరకు కొనసాగుతోంది. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో  విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement