అభ్యర్థులూ బహుపరాక్‌ | Model Code of Conduct for elections must be followed | Sakshi
Sakshi News home page

అభ్యర్థులూ బహుపరాక్‌

Oct 16 2026 5:19 AM | Updated on Oct 16 2026 5:19 AM

Model Code of Conduct for elections must be followed

ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాల్సిందే  

నిబంధనలు ఉల్లంఘిస్తే ఎస్‌ఈసీ చర్యలు  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో ఎన్నికల ప్రవర్తన ని­య­మావళి (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌–ఎంసీసీ)  అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు, అ­భ్య­ర్థు­లు పలు నిబంధనలు పాటించాలి. ప్ర­భుత్వం కొత్తగా ఎలాంటి కా­ర్యక్రమాలు చేపట్టకూడదు. నిబంధన­లు ఉల్లంఘించే వారిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) చర్యలు తీసుకుంటుంది. ము­న్సి­పల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్ర­వారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి గురించి తెలుసుకుందాం.

ప్రభుత్వ ఆస్తులపై ఫ్లెక్సీలు, వాల్‌ రాతలు నిషిద్ధం
ప్రభుత్వ భవనాలు, విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టాండ్లు, విద్యుత్‌ స్తంభాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి రాజకీయ ఫ్లెక్సీలు, పోస్టర్లు, కటౌట్లు, బ్యానర్లు, గోడరాతలు ఉండటానికి వీ­ల్లేదు. ఒకవేళ ఉంటే వాటిని వెంటనే తొలగించాలి.  

ప్రైవేట్‌ ఆస్తుల విషయంలో 
ప్రైవేట్‌ వ్యక్తుల ఇళ్లు లేదా స్థలాలపై వారి ముందస్తు రాతపూర్వక అనుమతి లేకుండా పోస్టర్లు అంటించకూడదు. జెండాలు కట్టకూడదు. అనుమతి పొందినా.. ఆ ఖర్చును అభ్యర్థి ఎన్నికల వ్యయంలోనే చూపించాలి. 

నేతల విగ్రహాలు 
రాజకీయ పార్టీల గుర్తులతో సంబంధం ఉన్న ప్రముఖ నేతల విగ్రహాలకు అధికారులు ముసుగులు  కప్పాలి.  

నగదు, బహుమతుల పంపిణీ
ఓటర్లను ఆకట్టుకునేలా నగదు, మద్యం, చీరలు లేదా ఇతర ఉచిత వస్తువుల పంపిణీ చేయడం తీవ్రమైన నేరం.  

రూ.50 వేల నగదు పరిమితి
సరైన ఆధారాలు, బ్యాంకు పత్రాలు లేకుండా రూ.50 వేలకంటే ఎక్కువ నగదును రవాణా చేయకూడదు. పట్టుబడితే అధికారులు ఆ సొమ్మును జప్తుచేస్తారు.

విద్వేష ప్రసంగాలు
కులాలు, మతాల మధ్య విద్వేషాలు రేకెత్తించేలా లేదా రెచ్చగొట్టేలా ఎలాంటి ప్రసంగాలు చేయకూడదు.  

ప్రార్థన మందిరాలు 
ఆలయాలు, మసీదులు, చర్చీలు, గురుద్వారాలు వంటి ఏ ప్రార్థనస్థలాన్ని కూడా ఎన్నికల ప్రచార వేదికలుగా, సమావేశ కేంద్రాలుగా ఉపయోగించరాదు.  

వ్యక్తిగత దూషణలు
ప్రత్యర్థి అభ్యర్థుల వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత విషయాలపై విమర్శలు చేయకూడదు. కేవలం వారి రాజకీయ విధానాలు, గత ట్రాక్‌ రికార్డుపై మాత్రమే విమర్శలు ఉండాలి.  

అధికార దుర్వినియోగం 
ప్రభుత్వ వాహనాల వాడకం: అధికారపక్షంలో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ అధికారిక పర్యటనలను ఎన్నికల ప్రచారంతో ముడిపెట్టకూడదు. ప్రభుత్వ వాహనాలు, యంత్రాంగం, సిబ్బందిని ప్రచారానికి వాడటం నిషిద్ధం. 

ప్రభుత్వ ప్రకటనలు: ప్రభుత్వ నిధులతో పత్రికలు, టీవీల్లో సంక్షేమ పథకాల ప్రకటనలు ఇవ్వకూడదు. లబ్ధిదారులకు ఇచ్చే పత్రాలపై సీఎం లేదా మంత్రుల ఫొటోలు ఉండరాదు.  

కాన్ఫరెన్స్‌లు: అధికారులతో మంత్రులు వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించరాదు.  

కొత్త పథకాలు, శంకుస్థాపనలు: ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రభుత్వం కొత్త సంక్షేమ పథకాలు ప్రకటించకూడదు, నిధులు మంజూరు చేయకూడదు. కొత్తగా శంకుస్థాపనలు , ప్రారంభోత్సవాలు చేయకూడదు.  

మైకులు, సభలు, ఊరేగింపులు 
సమయ నియంత్రణ: రాత్రి 10 గంటల నుంచి ఉదయం ఆరుగంటల వరకు మైకులు, లౌడ్‌స్పీకర్ల వాడకంపై పూర్తి నిషేధం ఉంటుంది. పగటిపూట ప్రచారరథాలు, మైకులు వాడాలన్నా, బహిరంగసభలు లేదా ర్యాలీలు నిర్వహించాలన్నా స్థానిక పోలీసు అధికారుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.

మద్యం నియంత్రణ 
పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి మద్యం విక్రయాలు, పంపిణీపై పూర్తి నిషేధం ఉంటుంది. బెల్ట్‌ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటారు.  

పోలింగ్‌రోజు నిబంధనలు 
స్లిప్పుల జారీ: పోలింగ్‌ కేంద్రాల బయట అభ్యర్థులు ఓటర్లకు ఇచ్చే గుర్తింపు స్లిప్పులు కేవలం తెల్ల కాగితంపై మాత్రమే ఉండాలి. దానిపై ఎలాంటి పార్టీ గుర్తులు, అభ్యర్థి ఫొటోలు ముద్రించకూడదు.  
ప్రచార పరిమితి: పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ప్రచారం చేయకూడదు. అక్కడ పార్టీల క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేయకూడదు.  
ఓటర్ల రవాణా: ఓటర్లను తమ వాహనాల్లో పోలింగ్‌ కేంద్రాలకు తీసుకురావడం, తిరిగి తీసుకువెళ్లడం వంటివి చేయకూడదు. ఇది ఎన్నికల చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement