లవ్లీనాను అభినందించిన సీఎం వైఎస్‌ జగన్‌ | CM YS Jagan Wishes Lovlina Borgohain Winning Bronze Tokyo Olympics | Sakshi
Sakshi News home page

Tokyo Olympics: కంగ్రాట్స్‌ లవ్లీనా: సీఎం వైఎస్‌ జగన్‌

Aug 4 2021 1:21 PM | Updated on Aug 4 2021 2:39 PM

CM YS Jagan Wishes Lovlina Borgohain Winning Bronze Tokyo Olympics - Sakshi

సాక్షి, అమరావతి: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత మహిళా బాక్సర్‌ లవ్లీనా బొర్గోహెయిన్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లోనే పతకం గెలుపొందేందుకు ఆమె పోరాడిన తీరు అద్భుతమని కొనియాడారు. ఎల్లప్పుడూ ఇలాగే గొప్పగా ఆడుతూ.. యువ క్రీడామణులకు, యువతకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సీఎం జగన్‌ బుధవారం ట్వీట్‌ చేశారు.

కాగా బుధవారం జరిగిన సెమీ ఫైనల్‌లో లవ్లీనా, టర్కీ బాక్సర్‌ బుసేనాజ్‌ చేతిలో ఓడి పోయిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌లో చిన్‌చెన్‌పై విజయం సాధించి ఆమె కాంస్య పతకం ఖాయం చేసుకున్నారు. తద్వారా ఒలింపిక్స్‌లో మెడల్‌ గెలిచిన మూడో భారత బాక్సర్‌గా లవ్లీనా నిలిచారు. అంతకు ముందు విజేందర్‌ సింగ్‌, మేరీ కోమ్‌ ఈ ఘనత సాధించారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement