మోగనున్న సమర శంఖం | Sakshi
Sakshi News home page

మోగనున్న సమర శంఖం

Published Sat, Apr 20 2024 2:05 AM

-

సాక్షి, అనకాపల్లి : సీఎం బస్సుయాత్ర జిల్లాలో శనివారం ఉదయం పాయకరావుపేట నియోజకవర్గం దొడ్డిగల్లు నుంచి ప్రారంభమై నాలుగు నియోజకవర్గాల్లో జరగనుంది. సార్వత్రిక ఎన్నికలకు తెరలేచిన తరువాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలు, పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు.

సీఎం పర్యటన ఇలా...

సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శనివారం ఉదయం 9 గంటలకు పాయకరావుపేట నియోజకవర్గం గొడిచెర్ల నుంచి ప్రారంభమవుతుంది. ఉద్దండపురం, కాగిత, సీతంపాలెం, నక్కపల్లి, అడ్డరోడ్డు, పులపర్తి, రేగుపాలెం, యలమంచిలి బైపాస్‌ మీదుగా మధ్యాహ్నం 12.30 గంటలకు అచ్యుతాపురంలో గల లంచ్‌ పాయింట్‌ క్యాంప్‌కు చేరుకుంటారు. అనంతరం కశింకోట మండలం నరసింగపల్లి సమీపంలోని చింతలపాలెం వద్ద బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు జరిగే బహిరంగ సభలో సీఎం వై.ఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. అనంతరం తాళ్లపాలెం జంక్షన్‌, బయ్యవరం, కశింకోట, కొత్తూరు, అనకాపల్లి జంక్షన్‌–1, జంక్షన్‌–2, శంకరం, రేబాక, మర్రిపాలెం టోల్‌గేట్‌, దేవీపురం, అస్కపల్లి మీదుగా రాత్రి 8.30 గంటలకు సబ్బవరం మండలంలోని చిన్నయ్యపాలెంలో గల టెర్రకాన్‌ రాయల్‌ వెంచర్‌ వద్దకు చేరుకుని అక్కడ రాత్రి బస చేయనున్నారు.

నేడు జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో సీఎం జగన్‌ యాత్ర

70 కిలోమీటర్ల మేర రోడ్‌ షో

కశింకోట మండలం చింతలపాలెం వద్ద భారీ బహిరంగ సభ

చిన్నయ్యపాలెం వద్ద సీఎం రాత్రి బస

Advertisement
Advertisement