‘గోదావరి తీరాన’ షూటింగ్‌ సందడి | Sakshi
Sakshi News home page

‘గోదావరి తీరాన’ షూటింగ్‌ సందడి

Published Fri, Apr 19 2024 2:05 AM

జడేరు పెద్దేరు వాగు వద్ద గోదావరి తీరాన చిత్రం షూటింగ్‌ సందడి  - Sakshi

గంగవరం : జడేరు గ్రామ సమీపంలోని పెద్దేరు వాగు వద్ద ‘గోదావరి తీరాన’ చిత్రం షూటింగ్‌ సందడి నెలకొంది. మండలంలోని రాజంపాలెం గిరిజన గ్రామానికి చెందిన కలుముల రవిబాబు అనే యువకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మూడు రోజులపాటు గంగవరం పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రానికి సంబంధించి సన్నివేశాలు చిత్రీకరిస్తామని రవిబాబు తెలిపారు. గ్రామీణ నేపథ్యంలో కామెడీ, యాక్షన్‌తో కూడిన ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తామని తెలిపారు. ఈ చిత్రంలోని ముఖ్యపాత్రల్లో అభిలాష్‌, మధురి, రవిబాబు, యమున రచ్చ, ఇతర పాత్రల్లో అనిల్‌ కుమార్‌, అమూల్య, సురే ష్‌, హరి బాబు నటిస్తున్నారని ఆయన తెలిపారు.

Advertisement
Advertisement