నూకాలమ్మ ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

నూకాలమ్మ ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు

Published Thu, Mar 28 2024 12:55 AM

నూకాలమ్మ అమ్మవారు - Sakshi

రాజవొమ్మంగి: స్థానిక గ్రామదేవత శ్రీనూకాలమ్మ అమ్మవారి గుడి తలుపులు తెరచుకొన్నాయి. కొత్త అమావాస్యకు జరిగే తిరునాళ్లకు ఏర్పాట్లు మొదలయ్యాయి. వంశపారంపర్యంగా వస్తున్న గుడి ఆసాదులు అమ్మవారి తలుపులు తీసి గరగలను బయటకు తీయడంతో ఉత్సవాలు మొదలైనట్టు స్థానికులు భావిస్తారు. ప్రతి రోజు రాత్రిళ్లు జరిగే గరగ నృత్యాలను భక్తులు ఆసక్తిగా తిలకిస్తారు. డప్పు వాయిద్యాలు, బాణాసంచా వెలుగుల్లో తమ ఇళ్లకు వచ్చే గరగలను సాక్షాత్తు అమ్మవారిగా భావించి పసుపు కుంకుమ, నూతన వస్త్రాలు, రకరకాల పిండివంటలు, పండ్లు పూలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడం గ్రామస్తుల ఆచారం. ఏప్రిల్‌ 6. 7. 8 తేదీల్లో అమ్మవారి ఉత్సవాలు జరగనున్నాయి. వేలాదిగా భక్తులు హాజరవుతారు. 9వ తేదీ తెల్లవారుజాముతో ఉత్సవాలు ముగించడంతో తిరిగి గుడి తలుపులు మూసి వేస్తారు. కొత్త అమావాస్య పండుగ ముగియగానే వచ్చే నూతన సంవత్సరం రోజున రైతులు ఏరువాక సాగి పొలం పనులకు శ్రీకారం ఆనవాయితీ. నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా జరిపేందుకు ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

Advertisement
Advertisement