పరీక్షల్లో ఫెయిలైతే మనోధైర్యం కోల్పోవద్దు● | Sakshi
Sakshi News home page

పరీక్షల్లో ఫెయిలైతే మనోధైర్యం కోల్పోవద్దు●

Published Tue, Apr 23 2024 8:45 AM

-

ఆదిలాబాద్‌టౌన్‌: విద్యార్థులు పరీక్షల్లో ఫెయిలైతే మనోఽధైర్యం కోల్పోయి ఎలాంటి అఘయిత్యాలకు పాల్పడకుండా ధైర్య ంగా ఉండాలని జిల్లా ఎన్‌సీడీ ప్రాజెక్ట్‌ అధి కారి ఎం.శ్రీధర్‌ అన్నారు. ఇంటర్మీడియెట్‌ ఫలితాలు మరో రెండు, మూడు రోజుల్లో వెలువడనున్న నేపథ్యంలో సోమవారం ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. కొన్ని సందర్భాల్లో విద్యార్థులు ఆశించిన మార్కులు రాకపోవచ్చని, దాన్ని చాలెంజ్‌గా తీసుకొని మళ్లీ పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాలే తప్ప నిరాశ చెంది ఆత్మహత్యకు యత్నించవద్దని పేర్కొన్నారు. ఒకసారి పరీక్ష తప్పినంత మాత్రన బాధపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎంతోమంది ఇంటర్‌లో ఫెయిల్‌ అయిన వారు మళ్లీ సప్లిమెంటరీలో పాస్‌ అయి వైద్యులుగా, ఇంజినీర్లుగా,ఉన్నతాధికారులుగా అయ్యారని గుర్తు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement