-
మౌంట్ షార్ప్ పర్వతపాదం చేరుకున్న క్యూరియాసిటీ
వాషింగ్టన్: అంగారకుడిపై గేల్‌క్రేటర్ ప్రాంతంలో రెండేళ్ల క్రితం దిగిన క్యూరియాసిటీ శోధక నౌక ఎట్టకేలకు తన తుది గమ్యానికి చేరువైంది. గేల్‌క్రేటర్ మధ్యలో సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌంట్‌షార్ప్ పర్వతం వద్దకు క్యూరియాసిటీ చేరుకుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది. భౌగోళికంగా ప్రత్యేకమైన పర్వత పాదం వద్ద కొంత అన్వేషణ తర్వాత రోవర్ ఐదున్నర కిలోమీటర్ల ఎత్తైన పర్వతం పైకి చరిత్రాత్మక ప్రయాణాన్ని ప్రారంభించనుంది. గేల్‌క్రేటర్‌లో 2012 ఆగస్టులో దిగిన క్యూరియాసిటీ తన రెండేళ్ల ప్రయాణంలో మార్స్‌పై ఒకప్పటి నీటి ప్రవాహ జాడలను కనుగొనడంతో పాటు అక్కడి శిలలు, మట్టిని విశ్లేషించి ఖనిజలవణాల సమాచారాన్ని, అనేక ఫొటోలను భూమికి పంపిన సంగతి తెలిసిందే. -
అరుణగ్రహంపై రెండేళ్లు...
అంగారకుడిపై జీవం ఆనవాళ్ల అన్వేషణలో బిజీగా ఉన్న నాసా క్యూరియాసిటీ రోవర్ మంగళవారం నాటికి మార్స్‌పై రెండేళ్లు పూర్తి చేసుకుంది. రోదసిలో దాదాపు 9 నెలలు ప్రయాణించి ఆగస్టు 5, 2012న మార్స్‌పై గేల్‌క్రేటర్ ప్రాంతంలో వాలిపోయిన క్యూరియాసిటీ ఈ రెండేళ్లలో ఆ గ్ర హం గురించి ఎన్నో వివరాలను భూమి కి పంపింది. అంగారకుడి మట్టి, శిలలపై లేజర్లను ప్రయోగించి వాటిలోని ఖనిజాలు, రసాయనాల వివరాలు సేకరించింది. ఒకప్పుడు అక్కడ సూక్ష్మజీవుల ఉనికికి అనుకూలమైన వాతావరణం ఉండేదా? అన్న కోణంలో పరిశోధించింది. ఎల్లోనైఫ్ బే అనే ప్రాంతంలో గతంలో నీరు పెద్ద ఎత్తున ప్రవహించిందని గుర్తించింది. అక్కడ ఒకప్పుడు ఉన్న మంచినీటి సరస్సు ఆనవాళ్లనూ కనుగొంది. గేల్‌క్రేటర్ మధ్యలో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌంట్ షార్ప్ పర్వతం దిశగా సాగుతున్న రోవర్ మరో మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే అక్కడికి చేరుకోనుంది. అయితే మౌంట్ షార్ప్‌కు చెందిన పర్వతపాదం 500 మీటర్ల దూరంలోనే ఉందని, క్యూరియాసిటీ అక్కడికి చేరితే చాలా ముఖ్యమైన విషయాలు తెలుస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్‌పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
Advertisement