breaking news
Virgin Mary statue
-
సూపర్ మూన్ అదిరింది..
పూర్ణ చంద్రుడు.. ముందు కన్య మరియ విగ్రహం.. ఫొటో అదిరిపోయింది కదూ.. సోమవారం రాత్రి అమెరికాలోని సౌత్ బెండ్లో ఉన్న నోట్రె డామ్ వర్సిటీ భవనంపై ఉన్న కన్య మరియ విగ్రహం వెనక సూపర్ మూన్ కనిపించి అందరినీ అలరించింది. -
మేరీమాత విగ్రహం నుంచి కన్నీరు
ఇజ్రాయిల్లో వింత సంఘటన చోటుచేసుకుంది. వర్జిన్ మేరీ విగ్రహం నుంచి కన్నీరు వస్తోంది. నూనెలాంటి ద్రవం కంటి నుంచి కారడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఏడాది క్రితం కోరియాస్ కుటుంబం ఈ విగ్రహాన్ని తెచ్చుకుంది. అప్పటి నుంచి విగ్రహం మాములుగానే ఉన్నా .. అనూహ్యరీతిలో ఇప్పుడు ఇలా తడిగా మారుతోంది. ఈ విషయం క్షణాల్లో చుట్టుపక్కల వ్యాపించగా .. లెక్కలేనంతమంది చూసేందుకు తరలివస్తున్నారు. ఫొటోలు తీసుకుని మురిసిపోతున్నారు. తమ ఇంట్లో మేరీమాత ఇలా అద్భుతాన్ని చూపించడంతో కుటుంబసభ్యులు తెగ సంతోషపడుతున్నారు.