breaking news
roof collapses
-
స్కూల్ పైకప్పు కూలి టీచర్‌తో పాటు 21 మంది విద్యార్థులు మృతి!
పెషావర్: పాకిస్తాన్‌లోని పెషావర్‌లో గురువారం పెను విషాదం చోటుచేసుకుంది. అఫ్రిది అబాద్ ప్రాంతంలోని ‘అల్ ఖైర్’ ప్రైవేట్ పాఠశాలలో తరగతులు జరుగుతున్న సమయంలో భవనం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఒక మహిళా ఉపాధ్యాయురాలితో పాటు 21 మంది చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ ప్రమాదంలో మరణించిన విద్యార్థులలో 18 మంది బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారని, వారి వయస్సు 7 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉంటుందని పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తరగతి గదుల్లో పాఠాలు వింటున్న చిన్నారులపై ఒక్కసారిగా కాంక్రీట్ స్లాబ్ పడటంతో పిల్లలు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది.గాయపడిన 21 మంది విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీపంలోని లేడీ రీడింగ్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో, బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆసుపత్రి యంత్రాంగం వెంటనే ఎమర్జెన్సీని ప్రకటించింది. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు శిథిలాలను తొలగించి సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. పెషావర్ డిప్యూటీ కమిషనర్ ఆఫాక్ వజీర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారేమోనని గాలింపు చర్యలను కొనసాగిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఇదీ చదవండి: రూ.65,000 కోట్ల మహా జాతర: బెంగాల్ దుర్గమ్మ సంబరం! -
డొమినికల్ రిపబ్లిక్ సంతో డొమింగోలో ఘోర ప్రమాదం
-
పైకప్పు కూలిపడి అయిదుగురు మృత్యువాత
లక్నో: ఇంట్లో నిద్రిస్తున్న వారిపై పైకప్పు కొంతభాగం కూలిపడిన ఘటనలో తల్లిదండ్రులు, వారి ముగ్గురు చిన్నారులు మృత్యువా తపడ్డారు. ఆలంబాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆనంద్‌నగర్ రైల్వే కాలనీలో శనివారం వేకువజామున ఘటన చోటుచేసుకుంది. ఉదయం 8 గంటల సమయంలో పారిశుధ్య సిబ్బంది గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అగ్నిమాపక సిబ్బంది, స్థానికులతో కలిసి శిథిలాల నుంచి చంద్ర, సరోజినీ దేవి(35), వారి పిల్లలు హర్షిత్(13), హర్షిత(10), అన్‡్ష(5) మృతదేహాలను వెలికి తీశారు. కాలనీలోని వారుంటున్న ఇల్లు శిథిలావస్థకు చేరుకుందని, ఖాళీ చేయమని నోటీసులిచ్చినా పట్టించుకోలేదని రైల్వే అధికారులు తెలిపారు. -
భవనం కుప్ప కూలి.. 10 మంది మృతి
లాహోర్: పాకిస్తాన్లో ఓ ఫ్యాక్టరీ భవనం పై కప్పు కుప్పకూలి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయాల పాలయ్యారు. బుధవారం సాయంత్రం లాహోర్ లోని పరిశ్రమల ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది ఇప్పటికే రిపేరులో ఉండటంతో మరమ్మత్తులు చేసేందుకు సిద్ధం చేసి ఉంచగా ఈ ప్రమాదం సంభవించింది. మొత్తం నాలుగు అంతస్తులుగా ఉన్న ఈ భవనంలో షాపింగ్ బ్యాగులు తయారు చేస్తుంటారు. మృతులు గాయపడిన వారు శిథిలాల కింద ఉన్నవారు అంతా కూడా అందులో పనిచేసే వర్కర్లు అని తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం 100 మందికి పైగా కూలీలు శిథిలాల కింద ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన జరిగే సమయంలో 150మంది పనిచేస్తున్నట్లు సమాచారం. -
బొగ్గు గనిలో ప్రమాదం, ఇద్దరు మృతి
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం శ్రీరాంపూర్ డివిజన్లోని ఆర్కే న్యూ టెక్ బొగ్గు గనిలో శనివారం ప్రమాదం జరిగింది. విధుల్లో ఉన్న కార్మికులపై ప్రమదవశాత్తు పైకప్పు కూలి బండరాయి పడటంతో ఇద్దరు మృతి చెందారు. మరి కొందరు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. కాగా అధికారులు.... క్షతగాత్రులను గని నుంచి బయటకు తీసుకు వచ్చే చర్యలు చేపట్టారు.ఈ సంఘటనపై కార్మికులు ఆందోళనకు దిగారు.


