breaking news
Marvelous scenery
-
గర్భస్థ పిండం నోటిలో మరో పిండం.. షాక్‌లో వైద్యులు!
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (ఐజీఎంసీ)లో ఇది వెలుగు చూసింది. గర్భంలో పెరుగుతున్న ఒక పిండం నోటిలో మరో పిండం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వైద్య పరిభాషలో ఈ అరుదైన పరిస్థితిని ‘ఫెటస్ ఇన్ ఫెటు’ (గర్భంలో పిండం)అని అంటారు. సాధారణంగా ప్రసవం తర్వాత బయటపడే ఈ రకమైన కేసులు, గర్భధారణ సమయంలోనే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా నిర్ధారణ కావడం విశేషం. ఈ కేస్ రిపోర్ట్‌ను వైద్య నిపుణులు ఇటీవల ఒక అంతర్జాతీయ వైద్య పత్రికలో ప్రచురించారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం 20 ఏళ్ల గర్భిణికి 22వ వారంలో నిర్వహించిన సోనోగ్రఫీ పరీక్షలో పిండం దవడలో అసాధారణంగా ఉన్నట్లు వెల్లడైంది. నోటిలో ప్రత్యేక నిర్మాణం కనిపించడంతో వైద్యులు అల్ట్రాసౌండ్, అధునాతన ఇమేజింగ్ పద్ధతుల ద్వారా సమగ్ర పరీక్షలు జరిపారు. ఈ పరీక్షల్లో నోటిలో ఉన్న ఆ నిర్మాణం 'ఫెటస్ ఇన్ ఫెటు'గా తేలింది. కవలల గర్భధారణ సమయంలో ఒక పిండం సరిగా అభివృద్ధి చెందక, మరొక పిండం శరీరంలో ఉండిపోవడం జరుగుతుంది. అయితే ఇలా నోటి భాగంలో, అది కూడా దవడలో తీవ్రమైన లోపాలతో పరాన్నజీవి పిండం ఏర్పడటం అత్యంత అరుదని వైద్యులు తెలిపారు.పిండంలో తీవ్రమైన అసాధారణతలు ఉన్నట్లు నిర్ధారించడంతో, గర్భిణి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్యుల సలహా మేరకు చట్టపరమైన ప్రక్రియను అనుసరించి గర్భాన్ని తొలగించారు. ఈ సమస్యను ముందుగానే గుర్తించడం వల్ల తల్లి ప్రాణాలకు ముప్పు తప్పిందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఐజీఎంసీ వైద్యుల ఈ అరుదైన అనుభవం అంతర్జాతీయ వైద్య రంగంలో గుర్తింపు పొందింది.ఇది కూడా చదవండి: ‘విరాళాల గోల్మాల్’ : ప్రధాని నివాసానికి సాధువుల భారీ మార్చ్! -
సూపర్ మూన్ అద్భుత దృశ్యం!
-
సూపర్ మూన్ అద్భుత దృశ్యం!
న్యూయార్క్: ఆకాశంలో సోమవారం సాయంత్రం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రతి పౌర్ణమి రోజు కంటే ఈ సారి చంద్రుడు (సూపర్ మూన్) అత్యంత పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించడంతో పాటు భూమికి దగ్గరగా వచ్చాడు. 1948లో ఇదే తరహాలో చంద్రుడు పెద్దగా కనిపించాడని, 70 ఏళ్ల తర్వాత మళ్లీ ఇవాళ అలా కనిపించాడని శాస్త్రవేత్తలు తెలిపారు. సూర్యాస్తమయ సమయంలో చంద్రుడు 14 శాతం పెద్దగా, 30 శాతం ప్రకాశవంతంగా కనిపించాడు. మళ్లీ ఇదే తరహాలో ‘సూపర్ మూన్’ 2034లో కనిపించనుంది. సూపర్ మూన్‌ను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. కొన్ని ప్రాంతాల్లో చంద్రుడిని చూసేందుకు శాస్త్రవేత్తలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
రేపు ఆకాశంలో అద్భుతం!
-
రేపు ఆకాశంలో అద్భుతం!
న్యూయార్క్: ఆకాశంలో ఈ నెల 14న (సోమవారం) ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ప్రతి పౌర్ణమి రోజు కంటే ఆరోజు చంద్రుడు (సూపర్ మూన్) అత్యంత పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. 1948లో ఇదే తరహాలో చంద్రుడు పెద్దగా కనిపించాడని, 70 ఏళ్ల తర్వాత సోమవారం అలా కనిపించనున్నాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడి కక్ష్య దీర్ఘవృత్తాకారంలో ఉంటుందని, అందుకే కొన్నిసార్లు భూమికి దగ్గరగా వస్తోందని నాసా పేర్కొంది. .అరుుతే సోమవారం సూర్యాస్తమయ సమయంలో చంద్రుడు 14 శాతం పెద్దగా, 30 శాతం ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. ఇదే తరహాలో ‘సూపర్ మూన్’ మళ్లీ 2034లో కనిపించనుంది. సోమవారం సూర్యాస్తమయం అద్భుతంగా ఉండనుందని, ఈ అవకాశాన్ని వదులుకోవద్దని నాసాకు చెందిన శాస్త్రవేత్త నోహ్ పెట్రో తెలిపారు. కానీ మేఘాలు సహకరించకపోతే మాత్రం తర్వాతి అవకాశం కోసం వేచి చూడాల్సిందేనని పరిశోధకులు అంటున్నారు.


