andhra pradesh legislative council
-
AP: ఫిరాయింపు ఎమ్మెల్సీ కొత్త డ్రామా?
విజయనగరం, సాక్షి: ఫిరాయింపు ఎమ్మెల్సీ ఇందుకురి రఘురాజు కొత్త డ్రామాకు తెర లేపారా?. సరిగ్గా శాసన మండలిలో అనర్హత పిటిషన్‌పై విచారణ నాడే ఆయన ఆస్పత్రిలో చేరడం ఆ అనుమానాలను బలపరుస్తోంది. ఎమ్మెల్సీ రఘురాజు వైఎస్సార్సీపీ నుంచి టీడీపీకి పార్టీ ఫిరాయించారు. దీంతో వైఎస్సార్సీపీ శాసనమండలిలో ఫిర్యాదు చేసింది. మే 27వ తేదీన విచారణకు హాజరు కావాలని మండలి చైర్మన్ మోషేన్ రాజు నోటీసులు పంపారు. అయితే ఆరోజు కారణం ఏంటో చెప్పకుండానే రఘురాజు విచారణకు గైర్హాజరు అయ్యారు. దీంతో విచారణను మే 31(ఇవాళ్టికి) వాయిదా వేశారు చైర్మన్. అయితే విచారణకు రాకుండా విశాఖ నారాయణ ఆస్పత్రిలో చేరారు రఘురాజు. కిడ్నీ సమస్యతో ఆయన ఆస్పత్రిలో చేరారని ఆయన అనుచరులు అంటున్నారు. మరోవైపు ఆయన ఇవాళ కూడా విచారణకు గైర్హాజరు కావడంతో చైర్మన్ మోషేన్ రాజు విచారణ వాయిదా వేయాల్సిన పరిస్థితి ఎదురైంది. తదుపరి విచారణ ఎప్పుడుంటుదనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.ఇటు శాసనమండలిలో.. అటు శాసనసభలోనూ చైర్మన్, స్పీకర్లు ఫిరాయింపులను తీవ్రంగా పరిగణిస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీకి.. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీకి మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. ఇక మండలిలోనూ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, వంశీ కృష్ణయాదవ్, సి. రామచంద్రయ్యలపైనా అనర్హత వేటు పడింది. -
మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు
సాక్షి, న్యూఢిల్లీ / సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 14 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. 9 స్థానిక సంస్థల నియోజకవర్గాలు, 3 పట్టభద్రులు, 2 టీచర్ల నియోజకవర్గాలకు మార్చి 13న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 16న కౌంటింగ్ చేపడతారు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. నామినేషన్లకు చివరి తేదీ ఈ నెల 23 కాగా, ఉపసంహరణకు ఈ నెల 27 చివరి తేదీగా నిర్ణయించారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. తెలంగాణలో 1 టీచర్ (హైదరాబాద్–రంగారెడ్డి– మహబూబ్‌నగర్) ఎమ్మెల్సీ, 1 స్థానిక సంస్థల (హైదరాబాద్) స్థానాల్లో కూడా ఇదే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీలో ఎన్నికలు జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు: అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 స్థానాలు, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే స్థానాలు : ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు కడప – అనంతపురం – కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలు : 1. ప్రకాశం– నెల్లూరు –చిత్తూరు 2. కడప– అనంతపురం– కర్నూలు 3. శ్రీకాకుళం– విజయనగరం– విశాఖపట్నం షెడ్యూల్: నోటిఫికేషన్ : ఫిబ్రవరి 16 నామినేషన్లకు చివరి తేది : ఫిబ్రవరి 23 నామినేషన్ల పరిశీలన: ఫిబ్రవరి 24 నామినేషన్ ఉపసంహరణ : ఫిబ్రవరి 27 ఎన్నిక : మార్చి 13 ఫలితాలు: మార్చి 16 -
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: వికేంద్రీకరణపై స్పల్ప కాలిక చర్చ
ఏపీ అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్ ►అభివృద్ధి చేయని, చేయలేని ప్రాంతం గురించి ఉద్యమం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిధ్వజమెత్తారు. కట్టని రాజధాని గురించి కట్టలేని గ్రాఫిక్స్ గురించి వెయ్యి రోజులుగా కృత్రిమ ఉద్యమాలు నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఎవరి అభివృద్ధి కోసం ఈ ఉద్యమాలు అని సీఎం జగన్ ప్రశ్నించారు. ► ‘టీడీపీ సొంత అభివృద్ధి కోసమే ఈ ఉద్యమాలు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కంటే కట్టని, కట్టలేని అమరావతి చంద్రబాబుకు గొప్పది. అమరావతి రాజధాని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల కోసం కాదు.. కేవలం పెత్తందారుల సొంత అభివృద్ధి కోసమే. ►నవరత్నాల ద్వారా రూ.లక్షా 65వేల కోట్లు డీబీటీ ద్వారా లబ్దిదారులకు అందించాం. అవినీతికి తావులేకుండా నేరుగా అకౌంట్లలో వేశాం. చంద్రబాబు హయాంలో రైతుభరోసా ఎందుకు లేదు?. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఎందుకు ఇవ్వలేదు?. 21 లక్షల ఇళ్లు ఎందుకు నిర్మించలేదు?. ►బాబు హయాంలోనూ, ఇప్పుడు ఒకే బడ్జెట్ ఉంది.. మరి ఆ నిధులన్నీ ఏమయ్యాయి?. చంద్రబాబు హయాంలో ఇన్ని పథకాలు ఎందుకివ్వలేదు?. ఆనాడు దోచుకో పంచుకో తినుకో అన్నట్లు సాగింది. ►బినామీ భూములు ప్రాంతమే రాజధానిగా ఉండాలనేదే పెత్తందారీల మనస్తత్వం. పచ్చళ్లు అమ్మినా మా వారి పచ్చళ్లే అమ్మాలనేది పెత్తందారీ మనస్తత్వం. చిట్‌ఫండ్ వ్యాపారమైనా మా వాళ్లే వ్యాపారం చేయాలనేది పెత్తందారీల మనస్తత్వం’ అని సీఎం జగన్ విమర్శించారు. ►మా వాడైతే ఆర్బీఐ నిబంధలను ఉల్లంఘించి చిట్‌ఫండ్ వ్యాపారం చేయొచ్చనేది వారి మనస్తత్వం. మా నారాయణ, మా చైతన్య ఉండాలనేది పెత్తందారీల మనస్తత్వం. ప్రతిపక్ష పార్టీలో కూడా నా మనుషులే ఉండాలనేది పెత్తందారీల మనస్తత్వం. వీళ్లంతా ఈ మధ్య ఒకటే రాజధాని అమరావతి అని డిజైన్ చేశారు’ అని సీఎం జగన్ ►ఏపీకి అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని కురసాల కన్నబాబు అన్నారు. టీడీపీ స్వప్రయోజనాల కోసమే రాజధానిగా అమరావతి ఉందన్నారు. విజన్ అని చెప్పుకునే చంద్రబాబు ప్లానింగ్ ఏంటో అర్థం కాలేదన్నారు. పాదయాత్ర పేరుతో హడావుడీ చేస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్రకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వమే కాకుండా నిర్మాత కూడా చంద్రబాబేనని విమర్శించారు. ►వికేంద్రీకరణపై అసెంబ్లీలో కన్నబాబు మాట్లాడుతూ.. ‘అభివృద్ధి వికేంద్రీకరణ అవమసరమని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. రాజధాని కోసం కేంద్రం శివరామకృష్ణన్ కమిటీని నియమిస్తే.. చంద్రబాబు నారాయణ కమిటీని నియమించారు. నారాయణ కమిటీ తుళ్లూరులో రాజధాని ఎంపిక చేసింది. దానికి అమరావతి అని పేరు పెట్టారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ చుట్టూ భూములు కొనిపించినట్టే.. తమ వాళ్లతో అమరావతిలోనూ చంద్రబాబు భూములు కొనిపించారు. రూ. లక్ష కోట్లతో రాజధాని అభివృద్ధి కష్టమనే.. సీఎం జగన్ వికేంద్రీకరణకు మొగ్గు చూపారు.’ అని కన్నాబాబు తెలిపారు. స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సీట్లలో కూర్చోవాలని స్పీకర్ ఆదేశించినా ఆందోళన కొనసాగించారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ను టీడీపీ సభ్యులు ఏకవచనంతో సంబోధించగా.. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. టీడీపీ సభ్యులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ►పయ్యావుల కేశవ్ కుమారుడు భూమలు కొన్నది వాస్తవం కాదా అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఎప్పుడెప్పుడు భూములు కొన్నారో తమ దగ్గర వివరాలు ఉన్నాయన్నారు. రాజధానిపై ఇష్టానుసారం మాట మార్చింది టీడీపీనే అని విమర్శించారు. ► కొందరి చేతుల్లోనే అమరావతి భూములు ఉన్నాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. వికేంద్రీకరణపై అసెంబ్లీలో స్పల్ప కాలిక చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అమరావతిలోనివి తాత్కాలిక నిర్మాణాలు అని తెలిపారు. 30 వేల ఎకరాల భూమిలో కొంతమంది చేతుల్లోనే 10 వేల ఎకరాలు ఉన్నాయని అన్నారు. టీడీపీ అంటేనే టెంపరరీ డెవలప్మెంట్ పార్టీ అని, అమరావతిలో టీడీపీ నేతలు భూములు కొన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ►16 వేల గ్రామాల్లో సచివాలయాలు పెట్టిన వ్యక్తి సీఎం జగన్. గ్రామ సచివాలయాలతో లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయి. పార్లమెంట్ నియోజకవర్గం ఒక జిల్లాగా.. 26 జిల్లాలు ఏర్పాటు చేశారు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా సీఎం జగన్ పాలన.మూడు ప్రాంతాల అభివృద్ధి కావాలంటే పరిపాలన వికేంద్రకరణ జరగాలని సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. ఒక కులానికో, మతానికో వ్యతిరేకంగా వికేంద్రీకరణ చేయడం లేదు. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ. సీఎం జగన్‌పై బురద జల్లడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. వాళ్లకు రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశం లేదు. 40 ఆలయాలు కూల్చిన దుర్మార్గుడు చంద్రబాబు. ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడుతున్నారు. తన స్వార్థం కోసం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవద్దు: కొడాలి నాని ► సచివాలయ వ్యవస్థను ప్రజలకు చేరువ చేసిన ఘనత సీఎం జగన్‌దే. గ్రామ సచివాలయాలతో ప్రజలకు పాలన చేరువైంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలన మరింత దగ్గరైంది. పాలనను ప్రజలకు చేరువ చేసేందుకే సచివాలయ వ్యవస్థ. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ మండలాలు ఏర్పాటు చేశాము. అన్నమయ్య పేరుతో జిల్లా ఏర్పాటు చేయడం గొప్ప ఆలోచన: భూమన కరుణాకర్ రెడ్డి ► వికేంద్రీకరణపై అసెంబ్లీలో స్పల్ప కాలిక చర్చ ►చంద్రబాబు డైరెక్షన్లో వీరాంజనేయులు పనిచేస్తున్నారు. అసెంబ్లీలో సభా హక్కులను ఉల్లంఘిస్తున్నారు. దళితులను కించపరచడం టీడీపీకి అలవాటే: సుధాకర్‌బాబు ►అసెంబ్లీలో నేను తప్పుగా ఏమీ మాట్లాడలేదు. బాల వీరాంజనేయులు బాధ్యతారహితంగా మాట్లాడారు: మేరుగ నాగార్జున ►మా సభ్యులను కావాలనే రెచ్చగొడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు.మేరుగ నాగార్జునను రెచ్చగొట్టాలని ప్రయత్నించి నీతులు చెబుతున్నారు. అలాంటి వ్యవహారాన్ని అంగీకరించొద్దు- అంబటి ►టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం ►సభలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టీకరణ ► ఉద్యోగాలపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదు. ఇంటికో ఉద్యోగమని చంద్రబాబు మోసం చేశారు. 1.30 లక్షల మందికి సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగాలు కల్పించాం. 2.80 లక్షల మందికి వాలంటీర్లుగా అవకాశం ఇచ్చాం. లోకం పూర్తిగా తెలియన వ్యక్తి లోకేష్.. దొడ్డిదారిన మంత్రి అయ్యారు. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో టీడీపీ విఫలం: వేణుగోపాలకృష్ణ ►తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ► ముగిసిన బీఏసీ సమావేశం.. ఐదురోజులపాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ► స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం ఈ సమావేశంలో సీఎం జగన్మోహన్రెడ్డితో పాటు సభ్యులు బుగ్గన, పెద్దిరెడ్డి, జోగి రమేస్, ప్రసాద్‌రాజు, శ్రీకాంత్‌రెడ్డిలు పాల్గొన్నారు. టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. దివంగత నేతలకు ఏపీ అసెంబ్లీ సంతాపం ► ఈ మధ్యకాలంలో కన్నుమూసిన నేతలకు.. ఏపీ అసెంబ్లీ సంతాపం తెలిపింది. మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పులపర్తి నారాయణమూర్తి, జేఆర్ పుష్పరాజ్, నల్లమిల్లి మూలారెడ్డి మృతి పట్ల సభ్యులు సంతాపం ప్రకటించారు. సభను అడ్డుకోవాలని టీడీపీ చూస్తోంది. ఏదో విధంగా గొడవ చేయాలని టీడీపీ సభ్యుల యత్నం. చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీ సభ్యుల ఆందోళన: అంబటి రాంబాబు ►నిరుద్యోగ భృతితో మోసం చేసింది చంద్రబాబు. ఎస్సీలను అవమానించిన వ్యక్తి చంద్రబాబు. స్టడీ సర్కిళ్లను వైఎస్సార్ అభివృద్ధి చేశారు: మేరుగ నాగార్జున ►దళిత వ్యతిరేకి చంద్రబాబు. గత ప్రభుత్వం ఎస్సీలకు చేసేందేమీ లేదు. పేదలకు చంద్రబాబు ఏనాడు మేలు చేయలేదు: జోగారావు ► టీడీపీ నేతలు రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయారు. టీడీపీ సభ్యులకు చర్చించే దమ్ము లేదు. చంద్రబాబు ఆదేశాలతోనే సభను అడ్డుకుంటున్నారు. త్వరలో జరగబోయేది టీడీపీ శవయాత్రే : జోగి రమేష్ ► టీడీపీకి నైతిక హక్కు లేదు. ప్రజా సమస్యలపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదు. చంద్రబాబు ఎలా ఉన్నారో.. వాళ్ల నాయకులు కూడా అలానే ఉన్నారు: సుధాకర్‌బాబు ► 2 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాం. సభా సమయం వృథా చేయడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. టీడీపీ సభ్యులు సభా సమయాన్ని వృధా చేస్తున్నారు. అసెంబ్లీ పెట్టాలని టీడీపీ నేతలు సవాల్ చేశారు. అసెంబ్లీ పెడితే చంద్రబాబు మళ్లీ డుమ్మాకొట్టారు. సభ్యులేమో ఇప్పుడు అడ్డుకోవాలని చూస్తున్నారు: గడికోట శ్రీకాంత్‌రెడ్డి టీడీపీ సభ్యుల తీరు సరికాదు: బుగ్గన ► ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైన నిమిషాల వ్యవధిలోనే.. ప్రతిపక్ష టీడీపీ సభను అడ్డుకునే యత్నం చేసింది. వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టి గోల చేశారు టీడీపీ సభ్యులు. సభను అడ్డుకునేందుకు ఆ పార్టీ సభ్యులు తీవ్రంగా యత్నించారు. ప్రశ్నోత్తరాల తర్వాత చర్చిద్దామని స్పీకర్ తమ్మినేని హామీ ఇచ్చినా.. వాళ్లు ఊరుకోలేదు. ఈ క్రమంలో.. మంత్రి బుగ్గన స్పందించారు. టీడీపీ సభ్యుల తీరు సరిగా లేదన్నారు. ప్రశ్నోత్తరాలు జరగకుండా టీడీపీ అడ్డుకుంటోందని, సభను అడ్డుకోవడానికే వాళ్లు వచ్చినట్లు ఉందని మండిపడ్డారు. ► ప్రశ్నోత్తరాలతో మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ► ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు. ► గురువారం నుంచి జరగనున్న ఆంధ్రప్రదేశ్ శాసన మండలి, శాసన సభ సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్ని శాఖల కార్యదర్శులను కోరారు. సమాచార, సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా పెరిగిపోయిన నేపథ్యంలో యావత్ ప్రజల దృష్టి ఈ సమావేశాలపై ఉంటుందనే విషయాన్ని అధికారులు అందరూ గుర్తించాలని చెప్పారు. ఇందుకోసం బుధవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ కమిటీ హాల్లో పలు శాఖల కార్యదర్శులు, పోలీస్ అధికారులతో వారు వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. ► సభ్యులు అడిగే ప్రశ్నలకు సకాలంలో సరైన సమాధానాలను అందిస్తూ వారి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అటువంటి సత్సంప్రదాయం కొనసాగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. గత సమావేశాల్లో గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలలో కొన్నింటికి ఇంకా సమాధానాలు అందజేయాల్సి ఉందని, వాటిని ఈ సమావేశాల్లో అందజేయాలని చెప్పారు. ► సభ్యులు అడిగిన ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు అందజేసేందుకు ప్రతి శాఖ ఒక లైజనింగ్ అధికారిని నియమించాలన్నారు. మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేల మెడికల్ బిల్లుల చెల్లింపుపై ఆరి్థక శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న మాజీ ప్రజా ప్రతినిధులకు వారు నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఔషధాలను అందజేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. ► ప్రశాంత వాతావరణంలో సమావేశాలు కొనసాగేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌లు.. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని కోరారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడా లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
ఆధునికీకరించిన ఏ పాఠశాల మూతపడదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాడు–నేడు ద్వారా ఆధునికీకరించిన ఏ పాఠశాల మూతపడదని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పాఠశాలలు మూసివేస్తామంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరో 27 వేల అదనపు తరగతి గదులు నిర్మిస్తామని చెప్పారు. ఎంఈవో పోస్టుల భర్తీ, పాఠశాలల విలీనం, ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు అనే అంశాలపై శాసనమండలిలో శుక్రవారం పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సురేష్ బదులిచ్చారు. విద్యాశాఖ అంశాలపై నియమించిన ఉన్నత స్థాయి కమిటీ ప్రతి మండలానికి ఎంఈవో–2ను నియమించాల్సిన అవసరాన్ని సూచించిందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఖాళీగా ఉన్న 264 ఎంఈవోలతోపాటు మరో 666 ఎంఈవో–2 పోస్టులను సృష్టించి వాటి భర్తీకి చర్యలు చేపడతామని తెలిపారు. దీనివల్ల ఏడాదికి రూ.28 కోట్లు అదనపు భారం పడుతుందన్నారు. వీటితోపాటు 36 డివిజనల్ విద్యాశాఖ అధికారుల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని చెప్పారు. ఎంఈవో, డివిజినల్ విద్యాశాఖ అధికారుల ఖాళీల భర్తీకి సీనియారిటీ ప్యానల్ రూపొందిస్తామన్నారు. స్వీపర్లను ఆయాలుగా చేసి వేతనాలు పెంచాం.. పాఠశాలల్లో పనిచేసేవారిని గత ప్రభుత్వం స్వీపర్లు అని కించపరిచేలా వ్యవహరిస్తే.. వారికి ఆయాలుగా పేరు మార్చి తమ ప్రభుత్వం గౌరవిస్తోందని మంత్రి సురేష్ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే 45,488 మంది ఆయాలకు గత ప్రభుత్వం రూ.2 వేలు వేతనంగా ఇస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారి వేతనాన్ని రూ.6 వేలకు పెంచిందని మంత్రి గుర్తుచేశారు. -
మంగళసూత్రాలతో రాజకీయాలా!
సాక్షి, అమరావతి: హిందూ మహిళలు ఎంతో పవిత్రంగా భావించే మంగళసూత్రాలను కూడా రాజకీయాలకు వాడుకుంటారా.. సిగ్గులేదా అంటూ శుక్రవారం శాసన మండలిలో పలువురు మహిళా ఎమ్మెల్సీలు టీడీపీ సభ్యులపై మండిపడ్డారు. ఉదయం సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్సీలు పోడియంలోకి వచ్చి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సమయంలో అందులో కొందరు మంగళసూత్రాలను చూపుతూ కేకలు వేశారు. దీంతో ఎమ్మెల్సీ టి.కల్పలతతో పాటు వైఎస్సార్సీపీకి చెందిన పోతుల సునీత, వరుదు కళ్యాణిలు పోడియంలోకి వచ్చి ‘తాళిబొట్లను సభలోకి తీసుకొచ్చి మహిళలను కించపరుస్తారా’ అంటూ టీడీపీ సభ్యుల తీరును తప్పుపట్టారు. చైర్మన్ వెంటనే ఆ మంగళసూత్రాలను స్వాధీనం చేసుకోవాలంటూ డిమాండ్ చేశారు. దీనిపై చైర్మన్ మోషేన్‌రాజు స్పందిస్తూ.. తాళి బొట్టు అనేది హిందూ మహిళలు పవిత్రంగా భావిస్తారని, వాటిని సభలోకి తీసుకొచ్చి మహిళలందరినీ అవహేళన చేస్తున్నారని.. వెంటనే సభ నుంచి బయటకు వెళ్లాలని ఆదేశించారు. అయినా టీడీపీ సభ్యులు అలాగే వ్యవహరిస్తుండడంతో మహిళా ఎమ్మెల్సీలతో వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీ సభ్యుల వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ సమయంలో చైర్మన్ సభను ఐదు నిమిషాలపాటు వాయిదా వేశారు. శాసనసభలోనూ.. టీడీపీ సభ్యులు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలోనూ తాళిబొట్లు ప్రదర్శించి నిరసన తెలిపారు. సారా మరణాలపై న్యాయవిచారణ నిర్వహించాలని నినాదాలు చేశారు. కొద్దిసేపు స్పీకర్ పోడియంపై చేతులతో చరుస్తూ సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తాళి బొట్లను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఆ తర్వాత సభ నుంచి వెళ్లిపోయారు. 8 మంది సస్పెన్షన్ వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారంభమయ్యాక కూడా టీడీపీ సభ్యులు పోడియంలోకి మళ్లీ వచ్చి మంగళసూత్రాలను ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో 8 మందిని సభ నుంచి సస్పెండ్ చేసేందుకు మంత్రి పెద్దిరెడ్డి ప్రతిపాదించగా.. ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, అశోక్‌బాబు, దీపక్‌రెడ్డి, కేఈ ప్రభాకర్, రాజసింహులు, దువ్వారపు రామారావు, తిరుమలనాయుడు, మంతెన వెంకట సత్యనారాయణరాజులను ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ మోషేన్‌రాజు ప్రకటించారు. మార్షల్స్ వారిని బలవంతంగా బయటకు తరలించారు. మిగిలిన ఎమ్మెల్సీలతో కలిసి లోకేశ్ కూడా బయటకు వెళ్లిపోయారు. -
కౌన్సిల్లోనూ టీడీపీ అదే తంతు
సాక్షి, అమరావతి: శాసన మండలిలో గురువారం కూడా టీడీపీ ఎమ్మెల్సీలు చిడతలతో భజనలు చేస్తూ, ఈలలు వేస్తూ గలాటా సృష్టించారు. చైర్మన్ మోషేన్‌రాజు ఎంత వారిస్తున్నా.. భజనలు చేసే వారు సభ నుంచి వెంటనే బయటకు వెళ్లాలని ఆదేశిస్తున్నా వారు అదే తీరున వ్యవహరించారు. దీంతో ఎనిమిది మందిని సస్పెండ్ చేసేందుకు మంత్రి కన్నబాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా చైర్మన్ వారిని ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండ్ అయిన వారిలో.. దీపక్‌రెడ్డి, అశోక్‌బాబు, బచ్చుల అర్జునుడు, అంగర రామ్మోహన్, కేఈ ప్రభాకర్, రాజనర్శింహులు, దువ్వారపు రామారావు, మర్రెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి ఉన్నారు. వీరంతా బయటకు వెళ్లిపోవాలని చైర్మన్ పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా వారు సభలోనే రాద్ధాంతాన్ని కొనసాగించారు. దీంతో.. చిడతలు, ఈలలను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని మోషేన్‌రాజు మార్షల్స్‌ను ఆదేశించారు. చైర్మన్‌తో వాదులాట.. తమ సస్పెన్షన్ వ్యవహారంలో చైర్మన్ వైఖరిని తప్పుపడుతూ లోకేశ్ సహా మరికొందరు టీడీపీ సభ్యులు ఆయనతో వాదులాటకు దిగారు. ఇదే సమయంలో దీపక్‌రెడ్డి తమ చుట్టూ ఉన్న మార్షల్స్‌ను తోసుకుంటూ చైర్మన్ పోడియం మెట్లు ఎక్కేందుకు యత్నించగా మోషేన్‌రాజు మండిపడ్డారు. లోకేశ్ ప్రవర్తన బాగోలేదంటూ వ్యాఖ్యానించారు. అనంతరం.. మార్షల్స్ సస్పెండ్ అయిన వారిని బలవంతంగా ఎత్తుకుని బయటకు తీసుకువెళ్లారు. అయినా కూడా అంగర రామ్మోహన్, బచ్చుల అర్జునుడు మరో గేట్ నుంచి తిరిగి సభలోకి వచ్చి ఆందోళన కొనసాగించేందుకు ప్రయత్నించగా మార్షల్స్ అడ్డుకున్నారు. మరోవైపు.. అప్పటిదాకా తన సీటులోనే కూర్చుని ఉన్న టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు సభలో ఈ గందరగోళం జరుగుతున్న సమయంలో నెమ్మదిగా బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత లోకేశ్ మిగిలిన టీడీపీ ఎమ్మెల్సీలూ వెళ్లిపోయారు. సస్పెండ్ అయిన వారిని బయటకు తీసుకెళ్లకుండా మార్షల్స్ తాత్సారం చేయడంపై మంత్రులు, పలువురు ఎమ్మెల్సీలు చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా సమస్యల కోసం కాదు, సస్పెన్షన్ కోసమే.. సస్పెండ్ ప్రక్రియ అనంతరం చైర్మన్ మోషేన్‌రాజు మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు సస్పెండ్ కావడానికే సభకు వచ్చారుగానీ, ప్రజా సమస్యలపై చర్చించడానికి కాదన్నారు. విచిత్రంగా తమను సస్పెండ్ చేయమని వారు అడుగుతున్నారని, కానీ.. సస్పెండ్ చేయకూడదని బుధవారం వరకూ ఓపిక పట్టామన్నారు. అనంతరం మంత్రులు, పలువురు ఎమ్మెల్సీలు మాట్లాడుతూ.. మండలి స్థాయిని టీడీపీ దిగజార్చిందంటూ తప్పుపట్టారు. పెద్దల సభలో ఇంత చిల్లరగా గలాటా చేయడం దురదృష్టకరమని మంత్రి కన్నబాబు అన్నారు. ఈ సభకు లోకేశ్ లాంటి వారు వచ్చాక ఇది దొడ్డిదారి సభలా ముద్రపడిపోయిందని చెప్పారు. మండలి అంటే చాలా గౌరవంగాను, హుందాగాను ఉండాలని.. కానీ అటువంటి సభా మర్యాదను టీడీపీ సభ్యులు మంటగలిపి సభ ఔన్నత్యాన్ని దిగజార్చారన్నారు. వారి ప్రవర్తనతో సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. చివరికి.. గోవింద నామాలను కించపరిచారన్నారు. బయటకు వెళ్లి ఏం చెప్పినా ప్రజలు నమ్మడంలేదు కాబట్టి ఈ సభను ప్రచారం కోసం వినియోగించుకోవాలని చూశారని మంత్రి అవంతి అన్నారు. దళిత వర్గానికి చెందిన వ్యక్తి చైర్మన్ స్థానంలో ఉండడం ఇష్టంలేనట్లుగా వారి ప్రవర్తన ఉందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని సీ రామచంద్రయ్య, ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మాధవ్‌రావు, అరుణ్‌కుమార్, రవీంద్రబాబు, భరత్, గోపాలరెడ్డి తదితరులు కూడా మాట్లాడారు. ఇదిలా ఉంటే.. సస్పెన్షన్‌కు ముందు టీడీపీ ఎమ్మెల్సీలు ‘మా భజన బాగుందా.. మీది బాగుందా’ అంటూ నినాదాలు చేస్తుండగా, మిగిలిన సభ్యుల వైపు నుంచి వీరిపై రూ.500 నోటు విసిరారు. -
మండలిలో ప్లేటు ఫిరాయించి టీడీపీ సభ్యులు
సాక్షి, అమరావతి: శాసనమండలిలో జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ జరగాలంటూ తెలుగుదేశం సభ్యులు వెల్‌లోకి వచ్చి ఆందోళన చేశారు. అయితే మరణాలపై చర్చకు రెడీగా ఉన్నామని ప్రభుత్వం తెలిపింది. జంగారెడ్డిగూడెం మరణాలపై స్టేట్మెంట్ ఇవ్వడానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సిద్ధమయ్యారు. దీంతో ఖంగుతున్న టీడీపీ నేతలు వెంటనే ప్లేటు ఫిరాయించారు. ముఖ్యమంత్రి సభకు వచ్చి జంగారెడ్డిగూడెం మరణాలపై స్టేట్మెంట్ ఇవ్వాలని యనమల రామకృష్ణుడు మాటమార్చారు. శాసనసభలో ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా ముఖ్యమంత్రే వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలన్న అన్నారు. సోమవారం ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ పరిగణలోకి రాదని అన్నారు. అయితే యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్ర అభ్యంతరం తెలిపారు. రూల్ 306లో ఆ శాఖకు సంబంధించిన మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వాలని రూల్ పొజిషన్లో చదివి వినిపించారు. యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలు శాసనమండలి చైర్మన్‌ను అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. నిబంధనల ప్రకారం సభ నడపాలని సూచించారు. సభను అడ్డుకోవడం మంచి పద్దతి కాదు: మండలి ఛైర్మన్ టీడీపీ సభ్యులు.. సభను అడ్డుకోవడం మంచి పద్దతి కాదని శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు అన్నారు. జంగారెడ్డిగూడెం మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్టేట్ మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారన్నారు. ప్రభుత్వం చెప్పింది ముందు వినాలని.. ఆ తర్వాత అభ్యంతరాలుంటే తెలపాలని మండలి ఛైర్మన్ మోషేన్‌రాజు పదే పదే చెప్పిన టీడీపీ ఎమ్మెల్సీలు పట్టించుకోలేదు. -
సమావేశాలు ముగిసేలోగానే సమాధానాలివ్వండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి, శాసన సభ సమావేశాలు ఈ నెల 7వ తేదీ నుంచి జరగనున్న నేపథ్యంలో గతంలో సభ్యులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానాలను సమావేశాలు పూర్తయ్యేలోపు అందజేయాలని అన్ని శాఖల కార్యదర్శులను మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఆదేశించారు. సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. శనివారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ కమిటీ హాల్లో వివిధ శాఖల కార్యదర్శులు, పోలీస్ అధికారులతో వేర్వేరుగా నిర్వహించిన సమావేశాల్లో మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ సమీక్షించారు. ఆ ప్రశ్నలే ఎక్కువ పెండింగ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు మాట్లాడుతూ.. గత సమావేశాల్లో మండలి సభ్యులు అడిగిన ప్రశ్నల్లో పాఠశాల విద్య, ఆర్థిక శాఖకు సంబంధించినవే ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. విద్యా వ్యవస్థను పటిష్టంగా తీర్చిదిద్దేందుకు పలు వినూత్న సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తోందని, వాటిని సుస్పష్టంగా వివరిస్తూ సరైన సమాధానాలను సభ్యులకు అందజేయాలని పాఠశాల విద్యా శాఖ కార్యదర్శికి సూచించారు. మాజీ ఎమ్మెల్సీల మెడికల్ బిల్లుల చెల్లింపుపై ఆర్థిక శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మాజీ ఎమ్మెల్సీలకు వారు నివశించే ప్రాంతాల్లోనే మందులు అందజేసే అంశాన్ని పరిశీలించాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. బందోబస్తు ఏర్పాట్లపై డీజీపీ కె.రాజేంద్రనాథ్‌రెడ్డికి పలు సూచనలు చేశారు. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమివ్వాలి శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ.. ప్రజల దృష్టంతా ఈ నెల 7 నుంచి జరిగే శాసన సభ సమావేశాలపై ఉంటుందని, వాటికి ఎంతో ప్రత్యేకత ఉందనే విషయాన్ని అధికారులు అందరూ గుర్తించాలని అన్నారు. ఈ నేపథ్యంలో సభ్యులు అడిగే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం అందజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గత సమావేశాల్లో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలను అందజేయాల్సి ఉందని, వాటన్నింటినీ ఈ సమావేశాలు ముగిసేలోపు తప్పక ఇవ్వాలని అన్నిశాఖల కార్యదర్శులను కోరారు. సచివాలయం చుట్టూ ఖాళీ ప్రాంతం ఎక్కువగా ఉన్న దృష్ట్యా అన్నివైపులా పటిష్టమైన బందోబస్తు, అధునాతన సమాచార, సాంకేతిక వ్యవస్థతో పటిష్టమై నిఘా ఏర్పాట్లు చేయాలని డీజీపీ కె.రాజేంద్రనాథ్‌రెడ్డికి సూచించారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యలు, డిప్యూటీ సెక్రటరీ ఎం.విజయరాజు, శాసన మండలి ఓఎస్డీ కె.సత్యనారాయణరావు, పలు శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఉన్నతాధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కడప గడపలో తొలిసారి.. బీసీ ఎమ్మెల్సీ
సాక్షి, అమరావతి: కడప జిల్లా నుంచి చట్టసభల్లో బీసీలకు అవకాశం దక్కటమంటే ఒక చరిత్రే!! ఎందుకంటే ఇక్కడ చివరిసారిగా 1962లో కాంగ్రెస్ తరఫున కుండ రామయ్య జమ్మలమడుగు నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు. ఆ తరవాత ఏ పార్టీ తరఫున కూడా ఎవ్వరూ ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర లేదు. పోనీ ఎమ్మెల్సీగా అయినా బీసీలకు అవకాశమిచ్చారా అంటే... ఏ పార్టీ కూడా అందుకు ముందుకు రాలేదు. బలహీనవర్గాలకు సముచిత ప్రాధాన్యమిస్తూ బీసీలంటే బ్యాక్వర్డ్ కాదు బ్యాక్‌బోన్ క్లాస్ అని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి జగన్... చేతల్లో కూడా అది చూపించారు. తాజాగా గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీలను నామినేట్ చేస్తూ కడప జిల్లా చరిత్రను తిరగరాశారు. అక్కడి నుంచి రమేష్ యాదవ్‌కు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు. వీటికి గవర్నరు ఈ నెల 10న ఆమోదముద్ర వేయగా సోమవారం అధికారికంగా ప్రకటించటం తెలిసిందే. నిజానికి ఆంధ్రప్రదేశ్ శానస మండలి ఏర్పాటయిన తరవాత కడప జిల్లా నుంచి మొత్తం 30 మంది ఎమ్మెల్సీలను ఇప్పటిదాకా వివిధ పార్టీలు నామినేట్ చేశాయి. వారిలో యాదవ సామాజిక వర్గానికి మాత్రం ఇప్పటిదాకా అవకాశం దక్కలేదు. ఇదే తొలిసారి. దీనిపై రమేష్ స్పందిస్తూ ‘‘నన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారని కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే ఈ జిల్లా నుంచి యాదవ వర్గానికి చెందినవారెవరూ ఇప్పటిదాకా ఎమ్మెల్సీ కాలేదు’’ అని సంతోషం వ్యక్తం చేశారు. రమేష్ యాదవ్ తండ్రి వెంకటసుబ్బయ్య 1987లో ప్రొద్దుటూరు మున్సిపల్ ఇన్చార్జి చైర్మన్‌గా పనిచేశారు. వైసీపీ ద్వారా క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ కావడం పట్ల జిల్లా బీసీలు సైతం హర్షం వ్యక్తం చేశాయి. జగన్ హయాంలోనే బడుగులకు అధికారం తాజాగా నామినేట్ చేసిన మోషేన్‌రాజు (పశ్చిమగోదావరి), రమేష్‌యాదవ్ (కడప), తోట త్రిమూర్తులు (తూర్పుగోదావరి), లేళ్ళ అప్పిరెడ్డి (గుంటూరు)లో సగం... అంటే ఇద్దరు ఎస్సీ, బీసీలకు చెందిన వారు కావటం గమనార్హం. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అధికారకంలోకి వచ్చాక వైఎస్సార్ సీపీ తరఫున ఇప్పటిదాకా 15 ఎమ్మెల్సీ స్థానాలను నామినేటెడ్, ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికల ద్వారా భర్తీ చేయగా... ఇందులో 4 ఎస్సీలకు, 4 బీసీలకు, 3 మైనార్టీలకు దక్కాయి. ప్రతిపక్షంలో ఉండగా 2018 తర్వాత భర్తీ చేసిన ఎమ్మెల్సీల్లోనూ బీసీ, ఎస్సీ, మైనార్టీలకు 12 సీట్లు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌దే. ఈ క్రమంలోనే బీసీ నేత జంగా కృష్ణమూర్తికి వైఎస్సార్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అవకాశం లభించింది. సామాజిక న్యాయమనేది మాటల్లో కాకుండా చేతల్లో జగన్ ఏ మేరకు చూపిస్తున్నారనేది తెలియటానికి ఈ ఉదంతాలు చాలు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సునీత
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఖాళీ అయిన స్థానానికి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీతను అభ్యర్థిగా సీఎం జగన్ ప్రకటించారు. ఆయన చేతుల మీదుగా సునీత బీ ఫారం అందుకున్నారు. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు సోమవారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె వెంట మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పోతుల సురేష్ ఉన్నారు. ఆ తర్వాత వెలగపూడిలోని అసెంబ్లీ ప్రాంగణంలో శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డికి సునీత తన నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు బీసీలను వాడుకుని వదిలేసేవారని, సీఎం వైఎస్ జగన్ మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీలను ఆదరిస్తున్నారని చెప్పారు. జగన్ పాలన స్వర్ణయుగమన్నారు. అన్ని వర్గాల ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చూడాలనే లక్ష్యంతో పనిచేస్తున్న జగన్ దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారన్నారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు కుళ్లు, కుతంత్రాలు, కుట్రలతో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుని తన బుద్ధిని చూపిస్తున్నారని విమర్శించారు. దేవుడినీ వదలకుండా రాజకీయానికి వాడుకుంటున్నారన్నారు. గతంలో టీడీపీ ఎమ్మెల్సీగా కొనసాగిన సునీత.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీరును నిరసిస్తూ రాజీనామా చేయడం తెలిసిందే. -
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసన మండలి శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలుత ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశమవుతుంది. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశం మొదలవుతుంది. ప్రస్తుత అంచనా ప్రకారం ఈ సమావేశాలు డిసెంబర్ 4వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగే అవకాశం ఉందని భావిస్తుండటంతో అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ తమ వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఉభయ సభల్లో ప్రారంభంలోనే తొలి అంశంగా సంతాప తీర్మానాలు ఉంటాయి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కుమార్ ముఖర్జీ, ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంతో పాటు పలువురు ప్రముఖులు, మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. శాసన మండలిలో కూడా ఈ ప్రముఖులతో పాటు మాజీ ఎమ్మెల్సీల మృతికి సంతాపం తెలిపే తీర్మానాలను ఆమోదిస్తారు. ఉభయ సభల్లోనూ ప్రభుత్వానికి చెందిన పలు అధికార పత్రాలను సమర్పించే కార్యక్రమం (పేపర్స్ లెయిడ్ ఆన్ ద టేబుల్) ఉంటుంది. బీఏసీ సమావేశంలో అజెండా ఖరారు ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ఉభయ సభలు కొద్ది సేపు విరామంతో వాయిదా పడతాయి. ఈ విరామ సమయంలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన ఆయన చాంబర్లో శాసనసభ కార్యకలాపాల సలహా మండలి (బీఏసీ) సమావేశం జరుగుతుంది. శీతాకాల సమావేశాలు ఎన్ని రోజులు జరిగేది, చర్చించాల్సిన అజెండా అంశాలను ఖరారు చేస్తారు. మండలిలో చైర్మన్ షరీఫ్ అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో యధావిధిగా ఎజెండాను ఖరారు చేస్తారు. ఎక్కువ రోజులు జరగాల్సిన సాధారణ బడ్జెట్ సమావేశాలు కరోనా మహమ్మారి వల్ల గత జూన్ నెలలో కేవలం రెండు రోజులు మాత్రమే జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇపుడు ఐదు రోజులు జరుగుతాయని భావిస్తున్న శీతాకాల సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ► రాజ్యాంగ నియమం ప్రకారం డిసెంబర్ 14వ తేదీ లోపుగా ఉభయ సభల సమావేశాలు జరిగి తీరాలి కనుక.. కరోనా తీవ్రత కొనసాగుతున్నప్పటికీ, ఉభయ సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుల్లో అనేకులు 60 ఏళ్లు దాటిన వారున్నప్పటికీ, తప్పనిసరిగా ఈ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ప్రజా సమస్యలపై చర్చకు అధికార పక్షం సిద్ధం ► ప్రజా ప్రాధాన్యత గల అంశాలను చర్చించాలని అధికార పక్షం భావిస్తోంది. నిజంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కానీ, అత్యవసర ప్రాధాన్యత గల అంశాలను కానీ ప్రతిపక్షం చర్చకు తెస్తే ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా చర్చకు తావిచ్చేందుకు, సమగ్రంగా అన్ని విషయాలు చర్చించేందుకు అధికారపక్షం మొగ్గు చూపుతోంది. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశాల్లో ప్రాధాన్యత గల అంశాలన్నింటిపైనా చర్చకు సిద్ధపడదామని, ప్రజాస్వామ్యయుతంగా అసెంబ్లీ, మండలిని నడిపిద్దామని సూచించారు. ► ప్రభుత్వం గత ఏడాదిన్నరగా చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలతో సహా ఇతరత్రా సమస్యలు సుమారు 20 వరకు ఎంపిక చేసి, చర్చ కోసం అధికారపక్షం సిద్ధపడుతోంది. శుక్ర, ఆదివారాల్లో జరిగిన ప్రభుత్వ చీఫ్ విప్, విప్, మంత్రుల సమావేశాల్లో అధికార పక్షం ఆయా అంశాల వారీగా చర్చలో పాల్గొనే వారికి బాధ్యతలు అప్పగించింది. ప్రతిపక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని వ్యూహం రూపొందించింది. అడ్డుకోవడమే ప్రతిపక్షం ఎజెండా ► ప్రజా సమస్యలపై ఒక దశ, దిశ లేకుండా సతమతం అవుతున్న ప్రతిపక్ష టీడీపీ.. ప్రభుత్వ కా>ర్యకలాపాలను అడ్డుకోవడం ద్వారా వార్తల్లోకి ఎక్కాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాము ఉభయ సభల్లోనూ అడ్డుకుంటామని ఆ పార్టీ ఏపీ విభాగం అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు బాహాటంగానే ప్రకటించారు. ► ముఖ్యంగా ప్రభుత్వం తెచ్చే అధికారిక బిల్లులను శాసనమండలిలో తమకున్న ఆధిక్యతతో అడ్డుకోవాలని టీడీపీ చూస్తోంది. ప్రజా ప్రాధాన్యం గల అంశాలపై చర్చ కన్నా రాజకీయ లబ్ధి చేకూరే కార్యక్రమాలపైనే దృష్టి పెట్టాలని టీడీపీ భావిస్తోంది. ► రాష్ట్ర ప్రజలకు అవసరమా? లేదా? అనే అంశాలను పక్కన పెట్టి, ప్రభుత్వం తెచ్చిన బిల్లును మండలిలో అడ్డుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పటికే దిశా నిర్దేశనం చేశారు. టీడీపీ అనుకూల మీడియాపై అసెంబ్లీ, మండలిలో ఉన్న ఆంక్షలు తొలగించాలని కోరుతూ ఉభయ సభల్లో ప్రతిష్టంభనకు దిగాలని టీడీపీ యోచిస్తున్నట్లు సమాచారం. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో టీడీపీ నేతలపై కక్ష సాధింపు జరుగుతోందని, రాష్ట్రంలో హింస, అవినీతి పెరిగి పోయిందని, రాష్ట్రంలో అసలు రాజ్యాంగమే అమలు కావడం లేదని ఆరోపిస్తూ ఉభయ సభల్లో చర్చకు దిగాలని ప్రతిపక్షం భావిస్తున్నట్లు తెలిసింది. పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదని కూడా ఆ పార్టీ ఆరోపిస్తోంది. 15 బిల్లులు.. 20 అంశాలు ► శీతాకాల శాసనసభ, మండలి సమావేశాల్లో సుమారు 15 బిల్లులను ప్రవేశ పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. సమావేశాలు 5 రోజులు జరుగుతాయని భావిస్తున్నందున ఇప్పటి వరకు బిల్లుల స్థానంలో ఉన్న ఆర్డినెన్సులన్నింటికీ చట్ట రూపం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. కొన్ని బిల్లుల వివరాలిలా ఉన్నాయి. ► ఏపీ పశుదాణా బిల్లు, చేపల దాణా బిల్లు, అక్వా కల్చర్ విత్తన బిల్లు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మార్పు బిల్లు, అసైన్మెంట్ భూమి బదలాయింపు నిషేధ సవరణ బిల్లు, ఏపీ వాల్యూ యాడెడ్ పన్ను సవరణ బిల్లు, ఏపీ వాల్యూ యాడెడ్ పన్ను (3వ సవరణ) బిల్లుతో పాటుగా సుమారు 15 బిల్లులు సభ ముందుకు వస్తాయని తెలుస్తోంది. ► మరి కొన్ని బిల్లులు వివిధ దశల్లో ఉన్నాయి. సమావేశాలు ముగిసే లోపు అవి కూడా సంబంధిత అనుమతులు పొందితే ఇదే సమావేశాల్లో చర్చకు వస్తాయని అధికార వర్గాల ద్వారా తెలిసింది. మొత్తం మీద వైఎస్సార్సీపీ శాసనసభా పక్షం ప్రజా ప్రాధాన్యం గల 20 అంశాలను సమావేశాల్లో చర్చకు తీసుకు రావాలని జాబితాను సిద్ధం చేసింది. చర్చకు రానున్న అంశాలు ► పోలవరం పురోగతి–గత ప్రభుత్వం తప్పిదాలు, ఇళ్ల పట్టాల పంపిణీ – ప్రతిపక్షాల కుట్ర, టిడ్కో గృహాలు –వాస్తవాలు, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ – ప్రతిపక్షాల కుట్ర, బీసీల సంక్షేమం – ప్రభుత్వ చర్యలు.. బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు, కరోనా నియంత్రణ – ప్రభుత్వ చర్యలు, వైద్య ఆరోగ్య రంగం – ఆరోగ్యశ్రీ. ► ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమం, వ్యవసాయ రంగం, ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ రుణాలు, రైతు భరోసా కేంద్రాలు, మద్దతు ధర, వైఎస్సార్ జలకళ, గ్రామ సచివాలయాలు – మెరుగైన పని తీరు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు –అమలు తీరు, మహిళా సాధికారత.. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, మద్య నియంత్రణ – ప్రభుత్వ సంస్థలు, ► నాడు–నేడు, సాగునీటి ప్రాజెక్టులు – రివర్స్ టెండరింగ్, అవినీతి నిర్మూలన – పారదర్శక పాలన, పారిశ్రామికాభివృద్ధి – ప్రభుత్వ చర్యలు, 9 గంటల ఉచిత విద్యుత్ – విద్యుత్ రంగంలో సంస్కరణలు, ప్రభుత్వ హామీలు – అమలు తీరు, నూతన ఇసుక విధానం అంశాలపై చర్చించాలని అధికారపక్షం భావిస్తోంది. ► వివిధ అంశాలపై ఉభయ సభల్లో చేపట్టే చర్చకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహంపై ఆదివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. శాసనమండలిపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఆయా అంశాలపై చర్చలో పాల్గొనే ఎమ్మెల్యేల పేర్లను కూడా ఖరారు చేశారు. -
ఏపీ మండలి చైర్మన్ షరీఫ్‌కు కరోనా
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ఎంఏ. షరీఫ్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఆయనకు స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు ఆయన కార్యాలయ అధికారులు తెలిపారు. షరీఫ్ కోవిడ్ బారిన పడటం బాధాకరమని ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
గవర్నర్ కోటాలో ఎస్సీ, ముస్లిం వర్గాలకు ఎమ్మెల్సీ పదవులు!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గవర్నర్ కోటాలో భర్తీ చేసే సభ్యుల్లో ఖాళీగా ఉన్న రెండు స్థానాల్లో ఒకటి ఎస్సీ, మరొకటి ముస్లిం వర్గాలకు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం త్వరలోనే ఈ మేరకు సిఫార్సు చేయనుందని వైఎస్సార్సీపీ వర్గాలు తెలిపాయి. ► ప్రస్తుతం మండలిలో మొత్తం నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణారావు రాజీనామా చేసిన కారణంగా శాసనసభ నుంచి ఎన్నికయ్యే రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ► గవర్నర్ నామినేట్ చేసే కోటాలో కంతేటి సత్యనారాయణరాజు, రత్నాబాయి పదవీ కాలం ముగిసిన కారణంగా ఖాళీ అయిన రెండు స్థానాలు కొంత కాలంగా అలాగే ఉన్నాయి. ► వైఎస్ జగన్ ప్రభుత్వం మండలిని రద్దు చేయాలని నిర్ణయించినప్పటికీ పైస్థాయిలో జాప్యం కారణంగా అది ఇప్పటికీ మనుగడలో ఉంది. మండలి రద్దు విషయంలో ఎలాంటి రెండో ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఇప్పటికే శాసనసభలో మండలి రద్దుకు తీర్మానం చేసి పంపారు కూడా. అయితే మండలి మనుగడలో ఉన్నంత వరకైనా ఖాళీ స్థానాలను భర్తీ చేయాలన్న ఆలోచనతో సీఎం ఉన్నట్టు తెలుస్తోంది. ► అందువల్ల గవర్నర్ నామినేటెడ్ స్థానాల్లో ఒకటి ఎస్సీ వర్గానికి, మరో స్థానం ముస్లిం మైనారిటీ వర్గాలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి తాజాగా యోచిస్తున్నట్టు సమాచారం. ► బోస్, మోపిదేవి రాజీనామా వల్ల ఖాళీ అయిన వాటిలో ఒక స్థానం పదవీ కాలం కేవలం 9 నెలలే ఉంది. మరో ఎమ్మెల్సీ పదవీ కాలం రెండేళ్ల పాటు ఉంటుంది. 9 నెలలే గడువున్న ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక జరిగే అవకాశం లేదు కనుక రెండేళ్ల పదవీ కాలం ఉన్న స్థానానికి కూడా అభ్యర్థిని త్వరలో సీఎం ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. -
మండలిలో మాటల యుద్ధం
సాక్షి, అమరావతి: శాసన మండలిలో బుధవారం రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై చర్చ కొనసాగుతున్న సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటా మాట పెరిగి కొద్ది సేపు సభా కార్యక్రమాలు వాడీవేడిగా కొనసాగాయి. బడ్జెట్‌పై చర్చలో టీడీపీ ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, నాగజగదీశ్వరరావులు మంత్రులపై చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రులు.. టీడీపీ సభ్యులకు దీటుగా జవాబిచ్చారు. మంత్రులు గెడ్డాలు పెంచి గత సమావేశాల సమయంలో సభలో రౌడీల మాదిరి వ్యవహరించారని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రి బొత్స జోక్యం చేసుకొని సభ్యులు అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని తీవ్ర స్థాయిలో అభ్యంతరం చెప్పారు. దీంతో చైర్మన్ షరీఫ్.. సభ్యులు బడ్జెట్‌పై చర్చకే పరిమితం కావాలని సూచించారు. ఆధారాలుండటం వల్లే అచ్చెన్నాయుడి అరెస్ట్ ► టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్టు వ్యవహారాన్ని ఆ పార్టీ ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావు ప్రస్తావిస్తూ.. ఈ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందన్నారు. ఈ వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా తప్పుపట్టారు. ► అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలు ఉండడం వల్లే అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్టు చేశారని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. దొంగతనం చేస్తే, అవినీతి చేస్తే బీసీలు కదా అని వదిలి వేయాలా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ ఒక్క బీసీ నేతకు కూడా రాజ్యసభ సీటు కేటాయించ లేదని, సీఎం జగన్ ఇప్పుడు ఒకేసారి ఇద్దరు బీసీ నేతలకు రాజ్యసభ సీట్లు ఇచ్చారని చెప్పారు. ► పేద కార్మికులకు సంబంధించిన రూ.150 కోట్ల వ్యవహారంలో అవినీతి జరిగిందని తేలడంతో అచ్చెన్నాయుడు అరెస్టు జరిగిందని, తప్పు చేయకుంటే చట్టం ముందు ఆయన తన నిజాయితీని నిరూపించుకోవాలని మంత్రి అనిల్‌కుమార్ సవాల్ విసిరారు. తప్పుచేసే బీసీల పట్ల ఒక తీరుగా, అగ్రవర్ణాల పట్ల మరో తీరుగా వ్యవహరించడం చట్టంలో లేదన్నారు. గత ప్రభుత్వంలో కాపు నాయకుడు ముద్రగడ దీక్ష చేస్తుంటే అక్కడ 3 వేల మంది పోలీసులను దించి దిగ్బంధనం చేశారన్నారు. చంద్రబాబుకు, చైర్మన్‌కూ గెడ్డం ఉంది.. ► ‘మంత్రులు గెడ్డాలు పెంచుకుంటే రౌడీలన్నట్టు టీడీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నారు.. చంద్రబాబుకు గెడ్డం ఉంది.. చైర్మన్‌కు కూడా గెడ్డం ఉంది.. వాళ్లు రౌడీలవుతారా’ అని అనిల్‌కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ► మంత్రి అనిల్ మాట్లాడే సమయంలో టీడీపీ ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావు జోక్యం చేసుకుని, మంత్రిపై క్రికెట్ బెట్టింగ్ కేసు ఉందనడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ► గత ప్రభుత్వంలో పోలీసులు కేవలం నోటీసులిచ్చారని, తాను తప్పు చేయలేదు కాబట్టి విచారణకు హాజరై తన నిజాయితీని నిరూపించుకున్నానని అనిల్ అన్నారు. పోలీసు రికార్డులు పరిశీలించుకోవచ్చని చెప్పారు. గత ఎన్నికల్లో అప్పటి ప్రభుత్వం వంద కోట్లు ఖర్చు పెట్టి తనను ఓడించడానికి ప్రయత్నించిందని, అయినా తనను ఏమీ చేయలేకపోయారని చెప్పారు. ► సభలో గొడవ ముదిరే పరిస్థితికి దారితీస్తుండటంతో చైర్మన్ సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత కూడా కొద్దిసేపు టీడీపీ ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావు, మంత్రి అనిల్ మధ్య వాగ్వాదం సాగింది. -
మండలిలో మరోసారి దుష్ట సంప్రదాయం!
సాక్షి, అమరావతి: అర్థవంతమైన చర్చలు, సలహాలు, సూచనలతో ఆదర్శంగా నిలవాల్సిన శాసనమండలి టీడీపీ రాజకీయ కుయుక్తులకు వేదికైంది. విపక్ష సభ్యులు మరోసారి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడ్డారు. శాసనసభ ఆమోదించిన బిల్లులను అడ్డుకునేందుకు ఏం చేయడానికైనా సిద్ధం అనే రీతిలో దౌర్జన్యంగా వ్యవహరించారు. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులతో పాటు ద్రవ్య వినిమయ బిల్లును బుధవారం మండలిలో ప్రవేశపెట్టనివ్వకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుని దుష్ట సంప్రదాయాన్ని కొనసాగించారు. నిబంధనల మేరకు సభ నడపాలని అధికార పార్టీకి చెందిన సభ్యులు అభ్యర్థించినా ఆలకించలేదు. రూల్ 90 ప్రకారం చర్చ చేపట్టాలంటే ఒక రోజు ముందుగా నోటీసు ఇవ్వాలనే సంప్రదాయాన్ని పాటించకుండా అప్పటికప్పుడు చైర్మన్‌కు నోటీసు ఇచ్చి పరిగణలోకి తీసుకోవాలంటూ టీడీపీ సభ్యులు రభస చేశారు. సంఖ్యా బలంతో జాప్యం చేయడం మినహా బిల్లులను అడ్డుకోలేమని తెలిసినా డ్రామాలకు తెరతీయడంపై ప్రజాస్వామికవాదులు, నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం మండలిలో ద్రవ్య వినిమయ బిల్లు సహా ఇతర బిల్లులను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం. మండలిలో బుధవారం జరిగిన పరిణామాలు ఆందోళనకరం.ద్రవ్య వినిమయ బిల్లును మండలి ఆమోదించడం రాజ్యాంగ విధి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను, బిల్లును రాజ్యసభ ఆమోదిస్తున్నప్పుడు ఇక్కడ ఈ పరిస్థితి ఏమిటి? ఆర్థిక బిల్లును అడ్డుకున్నా లావాదేవీలు ఆగవు. కాకుంటే కాస్త ఆలస్యమవుతాయి. – పీజే చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ పెద్దల సభ పరిధి సలహాల వరకే.. ‘ద్రవ్యవినిమయ బిల్లు మనీ బిల్లు కనుక శాసనసభకే సర్వాధికారాలుంటాయి. శాసనమండలి అనేది పెద్దల సభ. కేవలం సలహాలు ఇవ్వడం వరకు మాత్రమే దాని పరిధి. బడ్జెట్‌పై చర్చించి వారికేమైనా సలహాలుంటే ఇచ్చి ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించాల్సిందే. పరిస్థితులు ఎలా ఉన్నా సద్దుమణిగేలా చేస్తూ ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించే వరకు సభను కొనసాగించకుండా ఎందుకు వాయిదా వేశారో అర్థం కాకుండా ఉంది. ద్రవ్యవినిమయ బిల్లు పూర్తిగా అసెంబ్లీ అధికార పరిధికి లోబడి ఉంటుంది. మూడు రాజధానులకు సంబంధించి మొదట పంపించిన బిల్లుపై శాసనమండలి గడువులోగా ఏ నిర్ణయమూ తీసుకోలేదు కనుక రెండోసారి అదే బిల్లును మళ్లీ శాసనసభ ఆమోదించి మండలికి పంపించింది. మండలి కేవలం సలహాలు ఇవ్వడం వరకే పరిమితం తప్ప బిల్లులను అడ్డుకొనే అధికారం లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రత్యేక రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దల సభ ఏ ఉద్దేశంతో ఏర్పడిందో దానికి విరుద్ధంగా అక్కడ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. అలాంటి ప్రజలు ఎనుకున్న శాసనసభకే సర్వాధికారాలు ఉంటాయి తప్ప శాసనమండలికి ఏమీ అధికారం ఉండదు. సలహాలు ఇచ్చి అభిప్రాయం చెప్పడం వరకే పరిమితం కాకుండా అంతకు మించి అక్కడ వ్యవహారాలు కొనసాగుతుండడం విపరీతంగా కనిపిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా అక్కడి కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మూడు రాజధానుల బిల్లును రెండుసార్లు అసెంబ్లీలో ఆమోదించి పంపించారు. రెండోసారి పంపించిన తరువాత శాసనమండలిలో ప్రవేశపెట్టినా, ప్రవేశపెట్టకున్నా, చర్చించినా చర్చించకున్నా, ఆమోదించినా ఆమోదించకున్నా శాసనసభ దాన్ని పట్టించుకోవలసిన అవసరం లేదు. శాసనసభకు పూర్తి అధికారాలున్నందున రెండోసారి బిల్లు పంపినందున అది ఆమోదమైనట్లే భావించి నిర్ణయం తీసుకోవచ్చు. శాసనమండలి ఆమోదంతో శాసనసభకు కానీ, ప్రభుత్వానికి కానీ అవసరం లేదు. శాసనసభ ఆమోదించినందున ప్రభుత్వం దాని ఆధారంగా తదుపరి కార్యాచరణ ప్రారంభించవచ్చు. శాసనమండలికి నచ్చినా నచ్చకున్నా ప్రజలు నేరుగా ఎన్నుకున్న శాసనసభదే తుది నిర్ణయం అవుతుంది’ – కేఆర్ సురేష్‌రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ -
మండలి చైర్మన్ వైఖరిపై సీఎస్‌కు ఫిర్యాదు
-
‘బొండా ఉమాను జైల్లో వేయమంటారా’
సాక్షి, అమరావతి: అసెంబ్లీ కార్యదర్శిపై శాసన మండలి చైర్మన్ కక్ష సాధింపు దోరణితో వ్యవహరిస్తున్నారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. అసెంబ్లీ సెక్రటరీ నిబంధనల ప్రకారం నడుచుకున్నారని తెలిపారు. ఆయన్ను బెదిరించడం, మానసిక ఒత్తిడి చెయ్యడం సమంజసం కాదని హితవు పలికారు. కొన్ని పత్రికలు, పార్టీలు అసెంబ్లీ సెక్రటరీని బెదిరిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో ఉద్యోగ సంఘాల భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మండలి చైర్మన్ తీరుపై సీఎస్‌కు ఫిర్యాదు చేసినట్టు ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి తెలిపారు. (చదవండి : సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అసాధ్యం : అసెంబ్లీ కార్యదర్శి) ‘మేమంతా అసెంబ్లీ సెక్రటరీకి మద్దతుగా ఉంటాం. అవసరమైతే గవర్నర్‌ను కూడా కలుస్తాం. సెలెక్ట్ కమిటీని రూల్స్‌కి విరుద్ధంగా వేస్తున్నానని చైర్మన్ గారే చెప్పారు .మోషన్ ఇవ్వకుండా, ఓటింగ్ జరగలేదు. మరి ఎలా సెలెక్ట్ కమిటీ వేస్తారు. అందుకే అసెంబ్లీ సెక్రటరీ ఆమోదించలేదు. ఏ అధికారయినా రూల్ ప్రకారమే పని చేయాలి. మేమందరం నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తాం. అధికారుల జోలికి వస్తే చూస్తూ ఊరుకోం. రూల్స్ లేవు ఏమీ లేవని యనమల, బొండా ఉమా మాట్లాడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మిమ్మల్ని జైల్లో వేయమంటారా. అలా చేస్తే ఎవరైనా సమర్థిస్తారా’అని వెంకట్రామిరెడి పేర్కొన్నారు. (చదవండి : లేని సెలెక్ట్ కమిటీకి పేర్లు పంపడమేంటి?) -
సెలెక్ట్ కమిటీ ఏర్పాటు అసాధ్యం : అసెంబ్లీ కార్యదర్శి
సాక్షి, అమరావతి: శాసనమండలిలో ప్రతిపాదించిన పాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని అసెంబ్లీ కార్యదర్శి మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు మండలి చైర్మన్ పంపిన ఫైలును ఆయన వెనక్కి పంపించారు. క్లాజ్ 189 ఏ.. ప్రకారం సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని లెజిస్లేచర్ కార్యదర్శి (ఇన్చార్జి) పి.బాలకృష్ణమాచార్య పేర్కొన్నారు. (చదవండి : ఏపీ: సెలెక్ట్ కమిటీకి నో) మండలి చైర్మన్ నిర్ణయంతోనే.. పాలనా వికేంద్రీకరణ బిల్లును జనవరి 21న అసెంబ్లీ ఆమోదించి అదే రోజు శాసనమండలికి పంపింది. 22న మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణలు ఈ బిల్లును మండలిలో ప్రతిపాదించారు. నిబంధనల ప్రకారం బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటే ప్రతిపక్షం ఆ బిల్లును మండలి పరిశీలనకు తీసుకోవడానికి ముందే నోటీసులు ఇవ్వాలి. అయితే అలా జరగకపోగా, రెండు రోజుల సుదీర్ఘ వివాదానంతరం 23వ తేదీ చైర్మన్.. తన విచక్షణాధికారాలను ఉపయోగిస్తూ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్లు చెప్పి సమావేశాలను వాయిదా వేయడంతో వివాదం తలెత్తడం తెలిసిందే. -
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి ప్రోరోగ్
-
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి ప్రోరోగ్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. శాసన సభ, శాసన మండలి సమావేశాలను ప్రోరోగ్ చేస్తూ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ప్రోరోగ్ ఈ నెల 12వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అసెంబ్లీని ప్రోరోగ్ చేయడంతో అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల స్థానంలో ఆర్డినెన్స్ తెచ్చుకునేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు లభించినట్లు అయింది. కాగా బిల్లులు మండలి ముందున్న సమయంలో..సభలను ప్రోరోగ్ చేస్తే ఆర్డినెన్స్ జారీకి సాంకేతిక ఇబ్బందులు ఉండవని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. (ముఖం చెల్లక.. అసెంబ్లీకి రాలేక) ఢిల్లీ వెళ్లినా మండలి రద్దు ఆగదు.. తాడేపల్లి: శాసన మండలి రద్దును ఎవరూ అడ్డుకోలేరని మంత్రి విశ్వరూప్ స్పష్టం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీలు ఢిల్లీ వెళ్లినా మండలి రద్దు ఆగదన్నారు. మండలి రద్దు అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, ఈ విషయంలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తామని కేంద్ర బీజేపీ నేతలు చెప్పారన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు స్టేజ్ షో కోసం ఢిల్లీ వెళుతున్నారని విశ్వరూప్ ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు స్టేజ్ షోలు బాగా అలవాటు అని, సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిడి తేవడం సరికాదన్నారు. (ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రతిపక్షమే అడ్డు) చదవండి: ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రతిపక్షమే అడ్డు -
అన్ని చట్టప్రకారమే జరుగుతాయి: స్పీకర్
సాక్షి, విశాఖ : శాసన మండలి రద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపించామని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. ఆయన శుక్రవారం విశాఖ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘కేంద్రానికి ఉన్న నిబంధనల ప్రకారమే అన్ని జరుగుతాయి. చట్టం ఎవరికీ చుట్టం కాదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మండలిని రద్దు చేశారు. రాజధాని రైతులతో ప్రభుత్వం వేసిన కమిటీ మాట్లాడుతుంది. రైతులతో పాటు రైతు కూలీలకు కూడా పెన్షన్ అందచేస్తామని శాసన సభ వేదికగా ప్రకటించారు. కృత్రిమ ఉద్యమాల గురించి నేను మాట్లాడను. నిజంగా ఉద్యం జరిగితే దానికి అందరు మద్దతిద్దాం’ అని పేర్కొన్నారు. -
రాజ్యాంగం మేరకే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో చూడబోదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో కొన్ని టీవీ చానళ్లతో మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారమే కేంద్రం వ్యవహరిస్తుందని స్పష్టంచేశారు. ‘ఇది రాజకీయ వ్యవహారం కాదు. బీజేపీ తీసుకునే నిర్ణయమూ కాదు. శాసనమండలి రద్దుపై రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. వ్యవస్థ ఆధారంగా కేంద్రం ముందుకెళ్తుంది.. రాజకీయ కోణముండే ఆస్కారం లేదు’ అని వెల్లడించారు. ఎక్కడా రాజకీయాలకు తావుండదు బిల్లుపై బీజేపీ వైఖరి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘కేబినెట్ ఆమోదం పొంది ప్రభుత్వం ద్వారా వచ్చే బిల్లును ప్రభుత్వంలో ఉన్న పార్టీగా వ్యతిరేకించడం సాధ్యం కాదు కదా.. ఏవో కారణాల వల్ల ఆపేస్తారని, రాష్ట్రంలోని పరిస్థితుల కారణంగా ఆపేస్తారని కొందరు అంటున్నారు. నా అవగాహన మేరకు ఆర్టికల్ 169(1) ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేస్తే దానిని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలి. దీనిలో ఎక్కడా రాజకీయాలకు తావులేదు’ అని పేర్కొన్నారు. బీజేపీకి ఏపీ చట్టసభల్లో.. అది కూడా శాసన మండలిలో మాత్రమే ఇద్దరు సభ్యులు ఉన్నారని, మండలి రద్దుతో ఆ ప్రాతినిధ్యం కూడా పోతుందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఇద్దరున్నా పది మంది సభ్యులున్నా సంబంధం లేదని, వ్యవస్థకు లోబడి నడుచుకోవాలన్నారు. బిల్లు వెనుక బీజేపీ ఉందన్న విమర్శలను తోసిపుచ్చుతూ.. ‘అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని మాత్రమే కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుంది. అక్కడ ఏపార్టీ అధికారంలో ఉందన్న అంశాన్ని పరిగణించదు. కాబట్టి రాజకీయ కోణం నుంచి చూస్తే అది తప్పు. దీని వెనక బీజేపీ ఉందన్న విమర్శలు అక్కసుతో కూడినవే. ఏపీ ప్రజలు అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. మేం వారితో కలిసి పోటీచేయలేదు. ఈరోజు కూడా వారు ఎన్డీయేలో భాగస్వామి కాదు. అక్కడ సీపీఎం ఉన్నా రాజ్యాంగ వ్యవస్థకు లోబడి కేంద్రం నడుచుకుంటుంది’ అని స్పష్టం చేశారు. షెడ్యూల్‌కు అనుగుణంగా బిల్లుపై ముందుకెళ్తారు ఈ సమావేశాల్లోనే బిల్లు వచ్చే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. దీనికి సమాధానం కేంద్ర కేబినెట్ కార్యదర్శి లేదా హోం శాఖ లేదా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నుంచి లభించవచ్చని.. వాటి షెడ్యూలు ప్రకారం సమయానుసారంగా పనిచేస్తాయని చెప్పారు. రాజకీయ కోణంలో జాప్యం చేయడం.. వెంటనే చేయడం వంటి కోణాలకు ఆస్కారం ఉండదని వివరించారు. రాజధానిపై పార్లమెంటులో బీజేపీ వైఖరి ఎలా ఉంటుందని ప్రశ్నించగా ‘ఇది రాష్ట్ర పరిధిలోని అంశమని గతంలోనే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చెప్పారు. చర్చకు వస్తే మా పార్టీ వాణిని వినిపిస్తాం. దీనిని రాజకీయంగా రాష్ట్రంలో ఎదుర్కోవాలని గతంలోనే నిర్ణయించాం. కేంద్ర ప్రభుత్వానికి ఆపాదించాలనడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోం’ అని పేర్కొన్నారు. -
రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తాం
-
మండలి రద్దు: కేంద్రం అడ్డు చెప్పే ఛాన్సే లేదు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుపై కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానానికి కేంద్రం అడ్డు చెప్పే అవకాశం లేదని ఆయన తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సూచనల మాత్రమే చేస్తుందని, ఆ సూచనలపై అంతిమ నిర్ణయం పార్లమెంటు తీసుకుంటుందని తెలిపారు. మండలి రద్దు విషయంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసే ఆలోచన కేంద్రానికి లేదని ఆయన తేల్చి చెప్పారు. (మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం) -
చంద్రబాబుకు సవాల్.. ఆ విషయం చెప్పగలరా?
సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్రలో రాజధాని అవసరంలేదని చెప్పే ధైర్యం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి ఉందా అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. వెనుకబడిన కర్నూలులో హైకోర్టు అవసరంలేదని బహిరంగంగా చెప్పగలరా అని సవాల్ విసిరారు. మంగళవారం తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడిన శ్రీకాంత్ రెడ్డి.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ.. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. శాసనమండలి రద్దుకు టీడీపీ వ్యతిరేకమైతే అసెంబ్లీలో చర్చకు ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. వికేంద్రీకరణ, 13 జిల్లాల అభివృద్ధిపై టీడీపీ వైఖరి ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న దిశ చట్టంను దేశ వ్యాప్తంగా స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. (కేంద్రం ముందుకు మండలి రద్దు తీర్మానం) ‘అసత్యాలు ప్రచారాలు చేస్తూ.. ప్రజలను పక్కదారి పట్టించడంలో చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్. ఆయనలా దిగజారి మాట్లాడటానికి మాకు సంస్కారం అడ్డొస్తోంది. ఐదేళ్ల పదవీ కాలంలో కనీసం దుర్గగుడి ఫ్లై ఓవర్ కూడా పూర్తి చేయలేని చంద్రబాబు రాజధానిని ఎలా నిర్మించగలరు?. ప్రభుత్వ నిర్ణయంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. చంద్రబాబు దావోస్‌కు ఎందుకు వెళ్లారో చెప్పాలి. స్విస్ బ్యాంక్‌లో దాచుకున్న అక్రమ సొమ్ము కోసమే వెళ్లారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు చరిత్ర ఎలాంటిదో మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌రావు రాసిన పుస్తకం చూస్తే తెలుస్తుంద’ని శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు.