ఐటీడీఏ ఉద్యానాధికారిగా మరియన్న
ఖమ్మం వ్యవసాయం: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్ట్ ఉద్యానాధికారిగా జినుగు మరియన్నను నియమిస్తూ రాష్ట్ర ఉద్యాన సంచాలకుడు ఎల్.వెంకట్రామిరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఉద్యాన సహాయ సంచాలకుడిగా పనిచేస్తున్న మరియన్నను ఇక్కడకు బదిలీ చేశారు. ఖమ్మం జిల్లాలో సుదీర్ఘకాలంపాటు ఉద్యాన శాఖ అధికారిగా, సహాయ సంచాలకుడిగా ఆయన పనిచేశారు.