30వ వారం మేటి చిత్రాలు

 • నిరసించినా... సేవలు మాత్రం నిలుపం..! ఎందుకంటే వైద్యో నారాయణో హరి..!! (ఫొటో: వీరేష్‌, అనంతపురం)

 • నీటి ఆవిరి నింగినావరించే.. దుర్గమ్మ సన్నిది తుంపరల్లో తేలియాడే..!! (ఫొటో: విజయకృష్ణ, అమరావతి)

 • ప్రమాదానికి గేట్లుండవ్‌..! వచ్చి తగిలితే పరలోక ప్రయాణమే..!! (ఫొటో: మోహనకృష్ణ, తిరుమల)

 • కేటీఆర్‌ జన్మదినం..! మమ్ముట్టి తీపి ఫలహారం..!! (ఫొటో: కె. రమేష్‌బాబు)

 • కరెంటు కార్మికుల కష్టాలు తీరవా..! కాంట్రాక్టు బాధలు ప్రభుత్వానికి పట్టవా..!! (ఫొటో: ఎ. సురేష్‌కుమార్‌, హైదరాబాద్‌)

 • సంప్రదాయం తలపైకెక్కింది..! రంగుల సెల్ఫీ క్లిక్‌మంది..!! (ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు)

 • సారూ కేసీఆర్‌..! మంచి బడినిచ్చావ్‌.. చక్కని బ్యాగులిచ్చావ్‌..!! (ఫొటో: అరుణ్‌రెడ్డి, ఆదిలాబాద్‌)

 • వానరాల నీడలో పంటకు రక్షణ..! అపాయంలో పక్షుల భక్షణ..!! (ఫొటో: విజయకృష్ణ, అమరావతి)

 • బంద్‌ సంపూర్ణం..! బస్సు సేవలకు విరామం..!! (ఫొటో: బాషా, అనంతపురం)

 • అవసరం వచ్చింది ..! నీటిని పొదుపుగా వాడే ఆలోచన తెచ్చింది ..!! (ఫొటో: బాషా, అనంతపురం)

 • జగన్‌ పిలుపందుకుని జనం దండు కదిలింది..! బైకులపై బైలెల్లి బంద్‌ చేసింది..!! (ఫొటో: వీరేష్‌, అనంతపురం)

 • మరో వనజీవి బైలెల్లే..! ప్రాణవాయువిచ్చే మొక్కలే ప్రాణమై..!! (ఫొటో: సంపత్‌, భూపాలపల్లి)

 • కోటి మంది మానవహారం అయ్యవార్లకు కనబడాలే..! వారి గోసలు అందరికీ వినపడాలే..! (ఫొటో: ఎంవీ రమణ, గుంటూరు)

 • త్రివర్ణాలు పరుచుకున్నాయి..! తుది మెరుగులు మొదలయ్యాయి..!! (ఫొటో: రాంగోపాల్‌ రెడ్డి, గుంటూరు)

 • నెత్తిన బోనంతో శివమెత్తిన శక్తి..! అమ్మవారు రాకతో అందరిలో పొంగిన భక్తి..!! (ఫొటో: నాగరాజు, హైదరాబాద్‌)

 • బడికి పంపడమే ధ్యేయం..! ప్రమాదాలకు ఏదీ భయం..!! (ఫొటో: నోముల రాజేష్‌రెడ్డి, హైదరాబాద్‌)

 • ప్రజా యుద్ధనౌక పాటకు విరామం..! కాసేపట్లో దరువుల మోత ప్రారంభం..! (ఫొటో: ఎం. రవికుమార్‌, హైదరాబాద్‌)

 • మ్యాక్స్‌ ప్రారంభం..! మ్యాగ్జిమమ్‌ దొరికిందొక ఫ్యాషన్‌ సందోహం..!! (ఫొటో: ఎస్‌ఎస్‌. టాకూర్‌, హైదరాబాద్‌)

 • ఎత్తుకు చేర్చే నిచ్చెన..! ప్రమాదం మంచుకొచ్చి పరలోకాలకూ చేర్చునా..!! (ఫోటో: వేణుగోపాల్‌, జనగాం)

 • సూచిక బోర్డులు సూపర్‌..! నాటి నీరు పోస్తే మీరవుతారు బంపర్‌..!! (ఫోటో: వేణుగోపాల్‌, జనగాం)

 • తీగలల్లుకున్న ఈతమాను..! (ఫొటో: శైలేందర్‌రెడ్డి, జగిత్యాల)

 • పోడు భూముల జోలికొస్తే.. పోరాటపు ఎర్ర జెండా ఎత్తుతాం..!! (ఫొటో: దశరథ్‌ రజ్వా, కొత్తగూడెం)

 • అరవిరిసిన పాండవులు-కౌరవుల పువ్వు..!! (ఫొటో: రాదారపు రాజు, ఖమ్మం)

 • చాందీ పూరించిన శంఖంతో మొదలౌనో కాంగ్రెస్‌కు మంచి రోజులు..! (ఫొటో: హుస్సేన్‌, కర్నూలు)

 • నగరానికి కొత్త రూపు..! చుట్టూ నీరుతో హారమేశారు..!! (ఫొటో: శ్రీనివాసులు, కర్నూలు)

 • పచ్చ పచ్చని తోటల్లో ఆటపాటల్ల బాల్యం..!! (ఫొటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్‌)

 • కదం తొక్కిన శ్రేణులు..! బంద్‌ పరిపూర్ణం చేసిన నేతలు..!! (ఫొటో: అజీజ్‌, మచిలీపట్నం)

 • పాతాళ గంగలో మునకేస్తున్న జన సందోహం..!! (ఫొటో: సుధాకర్‌, నాగర్‌కర్నూలు)

 • వింతో విశేషమో..! పచ్చని పొలంలో ప్రకృతి విలాపమో..!! (ఫొటో: రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

 • అంతా మట్టి మనుషులమే..! దేశ భేదాలుండవ్‌..!! (ఫొటో: సతీష్‌, సిద్దిపేట)

 • మిద్దెక్కిన అభిమానం.! మత్స్యకారుల గోడు అమాత్యులకు వినిపించేందుకిదే తరుణం..!! (ఫొటో: జయశంకర్‌, శ్రీకాకుళం)

 • ప్రజల సొమ్ముతో పరాచకాలా..! ఎనీటైం మనీ తప్ప మరేదైనా ఉంటుందా..!! (ఫొటో: శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • నీటి కొలనులో పిల్లల మర్రి దేవాలయం..!! (ఫొటో: యాకయ్య, సూర్యాపేట)

 • బ్రహ్మ కడిగిన పాదము.. బ్రహ్మము తాననే పాదమూ..!! (ఫొటో: మోహనకృష్ణ, తిరుమల)

 • హోదా కోరితే ఎత్తి పడేస్తారా..! (ఫొటో: మహ్మద్‌ రఫి, తిరుపతి)

 • శాకాంబరిగా దర్శనమిచ్చిన కనక దుర్గా అమ్మవారు..!! (ఫొటో: కిషోర్‌, విజయవాడ)

 • ఎత్తు తక్కువైనా ఎత్తేస్తాం..! ఆటా పాటలతో అల్లాడిస్తాం..!! (ఫొటో: కిషోర్‌, విజయవాడ)

 • రెక్కలు కట్టుకొని వాలింది..! డొక్కలు ఎండిపోయే ఆకలి బాధతో..!! (ఫొటో: మనువిషాల్‌, విజయవాడ)

 • నీలారుణ ధగధగల్లో నాట్యమయూరి కళాకాంతులు..!! (ఫొటో: రూబెన్‌, విజయవాడ)

 • వేలాది భక్తుల తోడుగా గిరి ప్రదక్షిణలో సింహాచల అప్పన్న..! (ఫొటో: మోహన్‌రావు, విజయనగరం)

 • జనంలోకి తాబేలు.. ఏ అపాయం వాటిల్లకుంటే అదే చాలు..!! (ఫొటో: సత్యనారాయణ, విజయనగరం)

 • నగరం రోడ్లు లోతులో పడ్డాయి..! చూస్కోకుంటే కప్పెట్టేస్తాయి..! (ఫొటో: వరప్రసాద్‌, వరంగల్‌)

 • వల పండింది.. బంగారు తీగలూ పడ్డాయి..!! (ఫొటో: యాదిరెడ్డి, వనపర్తి)

 • కాలం పండింది..! నదిలో వరద చేరింది..!! (ఫొటో: యాదిరెడ్డి, వనపర్తి)

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top