ఆయన లేకుండా హనీమూన్కి వెళ్లి.. | women shares forlorn pictures of dream honeymoon | Sakshi
Sakshi News home page

ఆయన లేకుండా హనీమూన్కి వెళ్లి..

Jul 12 2016 5:18 PM | Updated on Sep 4 2017 4:42 AM

భర్త లేకుండా హనీమూన్ కి వెళ్లిన హుమా.. వాళ్లాయన లేని లోటును ఫీలవుతూ దిగిన ఫొటోలు ఫొటోలు వైరల్ అయ్యాయి.


బాలీవుడ్ 'క్వీన్' గుర్తుందా! ఆ సినిమాలో ఒంటరిగా హనీమూన్ కి వెళ్లే యువతిగా కంగనా రనౌత్ నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. దాదాపు క్వీన్ లాంటిదే ఓ మహిళ నిజజీవిత గాథ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. భర్త లేకుండా హనీమూన్ కి వెళ్లిన హుమా.. వాళ్లాయన లేని లోటును ఫీలవుతూ దిగిన ఫొటోలు ఫొటోలు వైరల్ అయ్యాయి.

పాకిస్థాన్ లోని లాహోర్ కు చెందిన హుమా, అర్సలాన్ దంపతులు తమ రెండో హనీమూన్ కోసం చారిత్రక గ్రీస్ కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. కూడా అత్తమామల్ని కూడా తీసుకెళ్లాలనుకున్నారు. అయితే గ్రీస్ ఎంబసీ అర్సలాన్ కు వీసా నిరాకరించడంతో కథ 'క్వీన్' తరహా మలుపు తిరిగింది. అత్తమామలు కూడా ఉన్నప్పటికీ ప్రియమైన భర్త తోడు లేని లోటును ప్రతిక్షణం ఫీలవుతూ హుమా పర్యాటక ప్రదేశాల్లో ఫొటోలు దిగింది.






Advertisement
 
Advertisement
Advertisement