ఉబర్ డ్రైవర్ వెకిలి చేష్టలు | Uber driver arrested for obscenity, dismissed in Kolkata | Sakshi
Sakshi News home page

ఉబర్ డ్రైవర్ వెకిలి చేష్టలు

Jul 22 2015 12:26 PM | Updated on Aug 30 2018 9:02 PM

ఉబర్ డ్రైవర్ వెకిలి చేష్టలు - Sakshi

ఉబర్ డ్రైవర్ వెకిలి చేష్టలు

ఉబర్ క్యాబ్ డ్రైవర్ల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. తాజాగా కోల్ కతాలో మరో ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కోల్ కతా: ఉబర్ క్యాబ్ డ్రైవర్ల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. తాజాగా కోల్ కతాలో మరో ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అభ్యంతరకరంగా ప్రవర్తించాడంటూ ఉబర్ క్యాబ్ డ్రైవర్ పై ఓ యువతి ఫిర్యాదు చేసింది. దక్షిణ కోల్ కతాలో ఈనెల 8న ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.

ఎల్జిన్ రోడ్డు నుంచి నేతాజీనగర్ కు వెళ్లేందుకు సదరు యువతి ఉబర్ క్యాబ్ ఎక్కింది. కొంతదూరం వెళ్లాక డ్రైవర్ పింటూ యాదవ్.. ఆమెను అద్దంలో చూస్తూ వెకిలి చేష్టలకు దిగాడు. అరిస్తే తనను ఏమైనా చేస్తాడనే భయంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. తన ఇల్లు రాగానే కారులోంచి దూకేసి లోపలికి పరిగెత్తింది. జరిగిందంతా స్నేహితురాలికి చెప్పింది. స్నేహితురాలు ధైర్యం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పింటూ యాదవ్ ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి బెయిల్ పై విడుదల చేశారు. అతడిని విధుల నుంచి తొలగించామని ఉబర్ సంస్థ తెలిపింది. అయితే తప్పుడు వివరాలతో ఉబర్ లో చేరాడని పోలీసులు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement