breaking news
Pintu Yadav
-
9 ఏళ్ల పింటు.. 31 ఏళ్ల తర్వాత అబ్దుల్ జబ్బార్‌గా ఇంటికి రావడంతో..
కతిహార్: బీహార్‌లోని కతిహార్‌కు చెందిన 9 ఏళ్ల బాలుడు పింటు యాదవ్, ఆడుకుంటూ అనుకోకుండా ఒక రైలెక్కి ఇంటికి దూరంగా పశ్చిమ బెంగాల్‌కు చేరుకున్నాడు. భాష రాక, దిక్కుతోచని స్థితిలో రోదిస్తున్న ఆ చిన్నారిని ఓ ముస్లిం కుటుంబం చేరదీసి ‘అబ్దుల్ జబ్బార్’గా పేరు పెట్టి తమ సొంత బిడ్డలా పెంచింది. కాలక్రమేణా అతనికి పెళ్లై, ఢిల్లీలో ఉంటూ ముగ్గురు పిల్లల తండ్రిగా తన కొత్త ప్రపంచాన్ని ఏర్పరచుకున్నాడు.అయితే అతనికి తన పుట్టింటి జ్ఞాపకాలు గుర్తుకు రావడంతో సోషల్ మీడియా ద్వారా తన కుటుంబాన్ని వెతికే ప్రయత్నాలు చేశాడు. ఎట్టకేలకు తన ఊరు కాంటాకోష్కు చేరుకోవడంతో, మూడు దశాబ్దాల సుదీర్ఘ అజ్ఞాత వాసానికి తెరపడింది. 31 ఏళ్ల సుదీర్ఘ కాలంలో పేరు, మతం, వేషధారణ, జీవితం అన్నీ మారిపోయినా తల్లి పేగు బంధం చెరగలేదు. ఊహించని విధంగా ఎదుట నిలబడిన కొడుకును చూసి మొదట గుర్తుపట్టలేకపోయినా, అతని కంటి పైనున్న చిన్ననాటి గాయాన్ని తల్లి మీనాదేవి ఇట్టే గుర్తించింది. ఆ క్షణంలో కొడుకును హత్తుకుని ఆ తల్లి కంట కార్చిన ఆనంద బాష్పాలు అందరి హృదయాలను ద్రవింపజేశాయి.వేరే మతంలో పెరిగి, వేరే పేరుతో జీవిస్తున్నప్పటికీ కన్న కొడుకును ఆ కుటుంబం ఏమాత్రం సంకోచించకుండా మనస్ఫూర్తిగా స్వాగతించింది. అంతేకాకుండా అబ్దుల్ జబ్బార్ భార్యను, పిల్లలను కూడా తమ కుటుంబంలో భాగం చేసుకుంటామని తండ్రి మోతీలాల్ యాదవ్ ప్రకటించడం మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. కాలం ఎంత మారినా, రక్త సంబంధాలు ఎప్పటికీ చెరిగిపోవని ఈ సంఘటన నిరూపించింది.ఇదీ చదవండి: ‘దుస్తుల కన్నా సేవలు మిన్న’.. పాక్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోల్స్ -
ఉబర్ డ్రైవర్ వెకిలి చేష్టలు
కోల్ కతా: ఉబర్ క్యాబ్ డ్రైవర్ల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. తాజాగా కోల్ కతాలో మరో ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అభ్యంతరకరంగా ప్రవర్తించాడంటూ ఉబర్ క్యాబ్ డ్రైవర్ పై ఓ యువతి ఫిర్యాదు చేసింది. దక్షిణ కోల్ కతాలో ఈనెల 8న ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఎల్జిన్ రోడ్డు నుంచి నేతాజీనగర్ కు వెళ్లేందుకు సదరు యువతి ఉబర్ క్యాబ్ ఎక్కింది. కొంతదూరం వెళ్లాక డ్రైవర్ పింటూ యాదవ్.. ఆమెను అద్దంలో చూస్తూ వెకిలి చేష్టలకు దిగాడు. అరిస్తే తనను ఏమైనా చేస్తాడనే భయంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. తన ఇల్లు రాగానే కారులోంచి దూకేసి లోపలికి పరిగెత్తింది. జరిగిందంతా స్నేహితురాలికి చెప్పింది. స్నేహితురాలు ధైర్యం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పింటూ యాదవ్ ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి బెయిల్ పై విడుదల చేశారు. అతడిని విధుల నుంచి తొలగించామని ఉబర్ సంస్థ తెలిపింది. అయితే తప్పుడు వివరాలతో ఉబర్ లో చేరాడని పోలీసులు గుర్తించారు.


