మార్కెట్లోకి సోనీ ఎక్స్పీరియా 'ఎక్స్ఏ ఆల్ట్రా' | Sony Xperia XA Ultra with 6-inch display, 16MP front cam launched at Rs 29,990 | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి సోనీ ఎక్స్పీరియా 'ఎక్స్ఏ ఆల్ట్రా'

Jul 26 2016 6:00 PM | Updated on Sep 4 2017 6:24 AM

మార్కెట్లోకి సోనీ ఎక్స్పీరియా 'ఎక్స్ఏ ఆల్ట్రా'

మార్కెట్లోకి సోనీ ఎక్స్పీరియా 'ఎక్స్ఏ ఆల్ట్రా'

జపనీస్ టెక్ దిగ్గజం సోని, ఎక్స్పీరియా ఎక్స్ సిరీస్ లో భాగంగా తొలి స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి ఆవిష్కరించేసింది.

జపనీస్ టెక్ దిగ్గజం సోని, ఎక్స్పీరియా ఎక్స్ సిరీస్ లో భాగంగా తొలి స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి ఆవిష్కరించేసింది. ఎక్స్పీరియా‘ఎక్స్ఏ అల్ట్రా’ పేరుతో ఆరు అంగుళాల ఫాబ్లెట్ను మంగళవారం మార్కెట్లోకి రిలీజ్ చేసింది. దీని ధర రూ.29,990గా కంపెనీ నిర్ణయించింది. అన్నీ సోనీ సెంటర్లు, మేజర్ ఎలక్ట్రానిక్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనున్నట్టు ప్రకటించింది. వైట్, గ్రాఫైట్ బ్లాక్, లైమ్ గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్, జూలై 27 నుంచి మార్కెట్లో లభ్యంకానుంది.10 నిమిషాల చార్జింగ్ తో 5.5 గంటల పాటు ఈ ఫోన్ పనిచేస్తుందని కంపెనీ చెప్పింది.

ఎక్స్పీరియా ఎక్స్ఏ ఆల్ట్రా ఫీచర్లు...
6 అంగుళాల 1080పీ డిస్ప్లే
స్క్రాచ్-రెసిస్టెంట్ కర్వ్డ్ 2.5 డీ గ్లాస్
2గిగాహెడ్జ్ ఆక్టా కోర్ మీడియా టెక్ ఎంటీ6755 హీలియో  పీ10 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆధారిత ఎక్స్పీరియా యూఐ
3 జీబీ ర్యామ్
16 జీబీ ఇంటర్నెల్ మెమరీ
200 జీబీ వరకు విస్తరణ మెమరీ
డ్యూయల్ సిమ్ ఫోన్  
21.5 మెగాపిక్సెల్ వెనుక కెమెరా
16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, స్మార్ట్ సెల్ఫీ ఫ్లాస్
4జీ ఎల్టీఈ కనెక్టివిటీ ఆప్షన్
2700 ఎంఏహెచ్ బ్యాటరీ (రెండురోజుల బ్యాటరీ లైఫ్)

Advertisement
 
Advertisement
Advertisement